ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రాల్లో రైతులను పట్టించుకోని అఽధికారులు

ABN, First Publish Date - 2021-12-04T06:31:37+05:30

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను అధికారులు పట్టించుకోవటం లేదని డీసీసీ అధ్య క్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆరోపించారు.

ధర్మపురి పట్టణంలో మాట్లాడుతున్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, డిసెంబరు 3: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను అధికారులు పట్టించుకోవటం లేదని డీసీసీ అధ్య క్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆరోపించారు. శుక్రవారం సా యంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుక వ స్తే రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తే ప్రతి రైతు తమ కష్టాలను పట్టించుకోవటం లేదని మొర పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తో కలి సి రెండు రోజుల క్రితం రైతులకు ధర్మకాంట స్లిప్స్‌ ఇచ్చేలా చూడాలని, రైస్‌మిల్లర్స్‌ ఇబ్బందులకు గురి చేయరని కలెక్టర్‌ దృష్టికి తీసుక వెళ్లామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల నుంచి ఎంత వరి ధాన్యం కొనుగో లు చేస్తుందో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సొసైటీ చైర్మన్లు తమ మాట రైస్‌మిల్లర్స్‌ వినిపించు కోవటం లేదని మాట్లాడటం బాధాకరంగా ఉందన్నారు. రై తులకు ధైర్యంగా నింపే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తామన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు రాయపట్నం జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిరసన కా ర్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశం లో ధర్మపురి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగనభట్ల ది నేష్‌, ఉపాధ్యక్షులు వేముల రాజేష్‌, నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంహరాజు ప్రసాద్‌, జైనా ఎంపీటీసీ కుంట రజిత-సుధాకర్‌, మైనార్టీ అధ్యక్షులు ఎండీ రఫియొ ద్దీన్‌, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, మొగిలి, రమేష్‌, రమేష్‌, గణేష్‌, భు వనేశ్వర్‌ పాల్గొన్నారు.   

 


Updated Date - 2021-12-04T06:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising