ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓబీ పనులకు ఆటంకం లేకుండా చూడాలి

ABN, First Publish Date - 2021-12-03T06:34:22+05:30

వార్షిక లక్ష్యాను చేరుకోడానికి వీలు గా అవసరమైన ఎక్స్‌ప్లోజివ్‌ సరఫ రా చేయాలని సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్‌ (ఆపరేషన్స్‌), బలరాం (పా, పీపీ)లు ఎక్స్‌ప్లోజివ్‌ తయారీ దారులు, సరఫరాదారులను ఆదేశిం చారు.

సమావేశంలో మాట్లాడుతున్న డైరెక్టర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


- సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్‌, బలరాం 

గోదావరిఖని, డిసెంబరు 2: వార్షిక లక్ష్యాను చేరుకోడానికి వీలు గా అవసరమైన ఎక్స్‌ప్లోజివ్‌ సరఫ రా చేయాలని సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్‌ (ఆపరేషన్స్‌), బలరాం (పా, పీపీ)లు ఎక్స్‌ప్లోజివ్‌ తయారీ దారులు, సరఫరాదారులను ఆదేశిం చారు. ఎక్స్‌ప్లోజివ్‌ సరఫరాపై గురువారం మైనింగ్‌ అడ్వయిజర్‌ డీఎన్‌ ప్రసాద్‌, జీఎం మార్కెటింగ్‌ సూర్యనారాయణలతో కలసి సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోడానికి రోజుకు 14.4 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీ తొలగించాల్సిన అవసరం ఉన్నదని, రోజుకు కనీసం 600 టన్నుల ఎక్స్‌ప్లోజివ్‌ సరఫరా చేయాలని తయారీ దారులు, సరఫరాదారులకు డైరెక్టర్లు సూచించారు. ప్రస్తుతం ఇచ్చిన ఇండెంట్‌లో 80 శాతం మేర సరఫరా జరుగుతుందని, దీన్ని వంద శాతానికి పెంచాలని డైరెక్టర్లు స్పష్టం చేశారు. కొత్త ఓసీపీల నుంచి ఉత్పత్తి ప్రారంభం కాను న్నందున ఎక్స్‌ప్లోజివ్‌ అవసరం పెరగను న్నదన్నారు. కొన్ని ఓసీపీల్లో బ్లాస్టింగ్‌ విఫల మైన సంఘటనలు చోటుచేసుకుంటున్నా యని, నాణ్యమైన పేలుడు పదార్థాలను సరఫరా చేయాలని డైరెక్టర్లు స్పష్టం చేశారు. నిర్ణీత లక్ష్యాల మేరకు ఓబీ, బొగ్గు తొలగిం పు కోసం ఏరియాల వారిగా వి విధ గనుల అవసరాల మేరకు కావాల్సిన ఎక్స్‌ప్లోజివ్‌ వివరాలను జీఎంలను అడిగి తెలుసుకు న్నారు. సింగరేణి ఇండెంట్‌కు అనుగుణంగా సరఫరా పెంచుతామని ఎక్స్‌ప్లోజివ్‌ తయా రీ, సరఫరా సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు. సమావేశంలో నాగభూషణరెడ్డి (జీఎం,సీపీపీ), సత్తయ్య(జీఎం, పీపీ), రమేష్‌(జీఎం, ఎంపీ), సురేందర్‌(జీఎం, స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌), ఎన్‌వీ రావు(జీఎం, ఎక్స్‌ప్లోజివ్స్‌), ఎస్వోటూ డైరెక్టర్లు దేవీకు మార్‌, రవిప్రసాద్‌లతో పాటు అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T06:34:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising