ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుందిళ్ల బ్యారేజీ వద్ద సందడిగా చేపల వేట

ABN, First Publish Date - 2021-07-27T06:21:10+05:30

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సిరిపురం సమీపంలోని గోదావరినదిలోని కాళ్వేశరం ప్రాజెక్టు పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ వద్ద సోమవారం మత్స్య సందడి కొనసాగింది.

సుందిళ్ల బ్యారేజీ వద్ద చేపలు పట్టుకుంటున్న జనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంథని రూరల్‌, జూలై 26: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సిరిపురం సమీపంలోని గోదావరినదిలోని కాళ్వేశరం ప్రాజెక్టు పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ వద్ద సోమవారం మత్స్య సందడి కొనసాగింది. బ్యారేజీ గేట్లను సోమవారం సాయంత్రం మూసి వేయడంతో దిగువన నీటి మట్టడం తగ్గడంతో గోదావరికి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు చేపలు పట్టుకున్నారు. బ్యారేజీకి అవతిలివైపు ఉన్న మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలోకి కిష్టాపూర్‌ వైపు బ్యారేజీలో మడుగు, బండరాళ్లు ఉండటంతో ఇటీవల వరదలో కొట్టుకు వచ్చిన చాపలు ఎక్కవగా చిక్కుకున్నాయి. బ్యారేజీలో మత్స్యకారులు వలలతో భారీ ఎత్తున చేపలను పట్టి అక్కడే విక్రయాలు జరిపారు. వీటిని చూసేందుకు, కొనుగోలు చేసేందుకు వందలాది మంది ప్రజలు అక్కడికి చేరుకోవడటంతో ప్రాంగణమంతా చేపల మార్కెట్‌ను తలపించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి భారీ వరదనీరు రావడంతో అధికారులు బ్యారేజీ గేట్లు లేపి నీటిని కిందకు వదిలారు. రెండు రోజులుగా వర్షాలు, వరద నీరు లేక పోవడంతో మళ్లీ గేట్లను మూసి వేశారు. దీంతో బ్యారేజీ కింది భాగంలో నీటి ప్రవాహం తగ్గడంతో బండరాళ్ల మధ్య లక్షలాది చేపలు చిక్కుకుపోయాయి. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు, మత్స్యకారులు బ్యారేజీ వద్దకు వెళ్లి చేపలు పట్టుకుంటున్నారు. వందలాది మంది అక్కడికి చేరుకొని చేపలు తీసుకెళ్తుండటంతో బ్యారేజీ వద్ద జనజాతర కొనసాగుతోంది.  


Updated Date - 2021-07-27T06:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising