ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఎల్.రమణ

ABN, First Publish Date - 2021-06-15T06:28:09+05:30

పార్టీ మార్పుపై..

జగిత్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎల్‌ రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్టీ మారే ఆలోచన లేదు

పదవులు, పైరవీలు, ప్రాపర్టీల కోసం పాకులాడేది లేదు

సోషల్‌ మీడియాలో జరుగుతున్నవి అవాస్తవ ప్రచారాలు

టీఎస్‌ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ


జగిత్యాల(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌లో గానీ, బీజేపీలో గానీ చేరే ఆలోచన లేదని, పదవులు, పైరవీలు, ప్రాపర్టీల కోసం పాకులాడే మనస్థత్వం తనది కాదని టీఎస్‌ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ స్పష్టం చేశారు. పార్టీ మార్పు వ్యవహారంపై సోషల్‌ మీడియాలో జరుగుతున్నవి అవాస్తవ ప్రచారాలని ఆయన కొట్టి పారేసారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  రమణ మాట్లాడారు. ప్రస్తుతం ఊహించని రీతిలో రాష్ట్రంలో రాజకీయ రంగంలో మార్పులు వస్తున్నాయన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతు న్న మార్పులను గమనిస్తూ స్వర్గీయ ఎన్టీఆర్‌ ఇచ్చిన రాజకీయ జన్మను ఎలా ముందుకు తీసుకవెళ్లాలో అన్న విషయంపై జగిత్యాలలో అనుచ రులతో అభిప్రాయ సేకరణ జరిపానన్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారం, సానుకూలమైన వాతావరణంలో ఏ విధంగా 27 ఏళ్లుగా ముందుకు వెళ్లి పనిచేశానో, అదేవిధంగా పనిచేయడానికి నిర్ణయించుకున్నామన్నారు. తాను ఏనాడూ పార్టీ మారుతానని ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదని స్పష్టం చేశారు.


టీఆర్‌ఎస్‌, బీజేపీ వాళ్లు సైతం తన ముందు ఎటువంటి ప్రతిపాదన పెట్టలేదని అన్నారు. జగిత్యాల నుంచి ప్రారంభమైన రాజకీ యం తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి స్థానం వరకు వెళ్లడానికి సహక రించిన పార్టీకి రుణ పడి ఉంటానన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం సంతోషకరంగా ఉందన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ను గమనిస్తున్నామని, ఎప్పటికప్పుడు తమ నాయకుడు చంద్రబాబుకు సమాచారం అందిస్తున్నామన్నారు. టీడీపీకి ఇన్నేళ్లు రుణ పడి చేశామని, చంద్రబాబు గౌరవానికి కానీ, పార్టీ ప్రతిష్టకు గానీ దెబ్బతగిలే విధంగా ప్రవర్తించేది లేదన్నారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌లో జరుగు తున్న మార్పుల విషయంలో తాము పట్టించుకోమన్నారు. ఇప్పటివరకు ఏ విధంగా వ్యవహరించానో, రానున్న కాలంలో సైతం అదే విధంగా టీడీపీలో పనిచేస్తానన్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తనపై వస్తున్న దుష్ప్రచారాలు బాధను కలిగిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-15T06:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising