ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోత బడి

ABN, First Publish Date - 2021-10-29T06:01:53+05:30

నిన్న మొన్నటి వరకు కరోనా కారణంగా ఉపాధి సన్నగిల్లి అంతంతమాత్రంగా ఆదాయంతో కుటుంబా న్ని నెట్టుకొస్తున్న మద్య తరగతి ప్రజలకు బడి ఫీజులు మోయలేని భా రాన్ని అందిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు

- పుస్తకాలు విక్రయిస్తూ వేలల్లో దోపిడీ

- మోయలేని భారమంటూ తల్లితండ్రుల గగ్గోలు

- నియంత్రణ లేక ఇబ్బందులు

- పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

జగిత్యాల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): నిన్న మొన్నటి వరకు కరోనా కారణంగా ఉపాధి సన్నగిల్లి అంతంతమాత్రంగా ఆదాయంతో కుటుంబా న్ని నెట్టుకొస్తున్న మద్య తరగతి ప్రజలకు బడి ఫీజులు మోయలేని భా రాన్ని అందిస్తున్నాయి. కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో పాఠశాలలు, వసతి గృహలు తెరుచుకుంటున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అ ధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తు న్నారు. కరోనా కారణంగా ప్రజల జీవన స్థితిగతులు దెబ్బ తిన్నందున ఫీ జులు తగ్గించి విడతల వారీగా వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించు కోవడం లేదు. కరోనా కాలంలో పాఠశాలలు మూతబడి ఉన్న సమ యం లో సైతం ఆన్‌లైన్‌ బోధన పేరిట అధిక ఫీజులు వసూలు చేశారని విమ ర్శిస్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల పేరిట, పుస్తకాల పేరిట అధిక ఫీజులు చెల్లించడం తమ వల్ల కావడం లేదని తల్లితండ్రులు తలలు ప ట్టుకుంటున్నారు.

జిల్లాలోని పాఠశాలలు...

జగిత్యాల జిల్లాలో 303 ప్రైవేటు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. 26 ప్రైవేటు, 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రపైవేటు పాఠశాలల్లో 69,494 మంది విద్యార్థులు ఉన్నారు.  ప్రైవేటు పాఠశాలలో చేరిన విద్యార్థుల్లో సగానికి పైగా రెసిడెన్షియల్‌ వి ద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 40 వే ల మంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటున్నట్లు అంచనా ఉంది. ప్రైవేటు పాఠశాలలకు అనుబందంగా పలు యాజమాన్యాలు వసతిగృహా లను నిర్వహిస్తున్నాయి. 

విద్యాశాఖ అధికారుల తనిఖీలేవి....

జగిత్యాల జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో అధికారుల తనిఖీ లు కనిపించడం లేదు. పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అధికారుల చేతుల్లో లేకపోవడం వల్ల అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో కొన్ని ప్రైవేటు పాఠశాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. పుస్తకాలు విక్రయి స్తున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లి తండ్రు ల నుంచి ఫిర్యాదులు అందినా వాటిని పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజులపై ని యంత్రణ బాధ్యతలను ప్రభుత్వం అధికారులకు అప్పగించకపోవడంతో ఆడింది ఆట పాడింది పాటగా తయారయింది. 

భారంగా మారుతున్న ఫీజులు....

కరోనా కారణంగా ప్రజల స్థితిగతులు దెబ్బతిన్నందున ప్రస్తుతం ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజులు మోయలేని భారంగా మారుతున్నాయి. ఈ ఏడాది పాఠశాలలు పునప్రారంభం కాగా కొన్ని ప్రైవేటు సంస్థలు ఫీజులు తగ్గించకపోగా ఫీజులు పెంచి విద్యార్థుల త ల్లితండ్రుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉ న్నాయి. కొన్ని పాఠశాలలు గత ఏడాది ఫీజులు కలిపి ఈ ఏడాది మొ త్తం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులు చెల్లించకుంటే విద్యార్థులపై పలు రకాల ఒత్తిడి తేవడంతో చేసేది లేక అప్పు చేసి  ఫీ జులు చెల్లిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి ఫీజుల భా రం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పాఠశాలల పరిస్థితి సైతం దయనీయంగా...

కరోనా కారణంగా కొన్ని ప్రైవేటు పాఠశాలల పరిస్థితి సైతం దయనీ యంగా మారింది. కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా పాఠశాలలు మూతపడడం వల్ల యాజమాన్యాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నాయి. పాఠశాల భవనాల అద్దెలు చెల్లించడం, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు చెల్లించడం, బడి బస్సుల మరమ్మతులు, విద్యుత్‌ బి ల్లుల భారాన్ని ఆయా పాఠశాలల యజమాన్యాలు మోశాయి. ఇటీవల పాఠశాలలు తెరిచినప్పటికీ సకాలంలో ఫీజులు వసూలు కాక, గత యే డాది ఫీజు బకాయిలు రూ. లక్షల్లో పేరుకుపోవడం తదితర కారణాల వల్ల పాఠశాలల యాజమాన్యాలు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటు న్నాయి. ఇప్పటికైనా పాఠశాలలు తెరుచుకోవడం వల్ల ఫీజులు వసూలు అయి పాఠశాలలు గాడిన పడుతాయని యాజమాన్యాలు భావిస్తున్నా యి. అయినప్పటికీ బలవంతపు ఫీజుల వసూళ్లు నిలిపివేయాలని విద్యా ర్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలి

- దొనికెల నవీన్‌, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, 

జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారీతిగా ఫీజులను వసూ లు చేస్తున్నారు. ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు టీసీలను ఇచ్చి పంపించి వేస్తున్నారు. పలు విధాలుగా వేధింపులకు గురిచేస్తున్నారు. పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజులను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవస రముంది.


ఫీజు వసూలుపై నియంత్రణలు లేవు

- జగన్‌ మోహన్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి, జగిత్యాల

ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులు వసూలుపై ప్రభుత్వం ఎటువంటి నియంత్రణలు విధించలేదు. దీంతో తాము ఎటువంటి చర్యలు తీసుకోలే కపోతున్నాము. కరోనా నేపథ్యంలో ఫీజులను పెంచకుండా ఉండడం, నెల నెల వసూలు చేయడం వంటివి చేయాలన్న సూచనలు చేస్తున్నాము. 

Updated Date - 2021-10-29T06:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising