ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమీషన్ల కొరకే కాళేశ్వరం

ABN, First Publish Date - 2021-01-14T06:33:30+05:30

రాష్ట్ర ప్రభుత్వం కేవలం కమీషన్ల కొరకే కాళేశ్వరం నిర్మాణాలను జరుపుతోందని, ప్రాజెక్టు వల్ల అదనంగా రైతులకు ఒరిగేది ఏమీ లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జగిత్యాల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కేవలం కమీషన్ల కొరకే కాళేశ్వరం నిర్మాణాలను జరుపుతోందని, ప్రాజెక్టు వల్ల అదనంగా రైతులకు ఒరిగేది ఏమీ లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు నిష్ప్రయోజనంగా మారుతున్నాయన్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ యోచించిన థర్డ్‌ ఫ్రంట్‌ టెంట్‌ వేయకముందే కూలిందన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సీఎం కేసీఆర్‌ వేసిన ఎత్తులు పనికిరాకుండపోయాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ కుమ్మక్కయ్యారని అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ నాయకుడని చెప్పుకుంటున్న కేసీఆర్‌ తెలంగాణకు చెందిన సాగునీరు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు.  

Updated Date - 2021-01-14T06:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising