ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌భగీరథ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం

ABN, First Publish Date - 2021-01-17T04:45:49+05:30

మిషన్‌భగీరథ పనుల నతకతనడక, గ్రామాల్లో అసంపూర్తి పనులపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవిశంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొక్కుబడిగా సాగిన మండల పరిషత్‌ సమావేశం

మల్యాల, జనవరి 16: మిషన్‌భగీరథ పనుల నతకతనడక, గ్రామాల్లో అసంపూర్తి పనులపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులన్నీ ఏప్రిల్‌ 15నాటికి పూర్తికావాలని లేకుంటే ఉద్యో గాలను వదులుకోవల్సి ఉంటుందని మండిపడ్డారు. ఎంపీపీ మిట్టపెల్లి వి మల అధ్యక్షతన జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ము ఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సమావేశం ఎజెండా అంశాలను చదవడానికి పరిమితం కాగా మ్యాడంపెల్లి, మల్యాల, తక్కళ్లపెల్లి గ్రామా ల్లో మిషన్‌భగీరథ పనులు పూర్తి కాలేదని సర్పంచిలు రౌతు గంగ మహ శ్వరీ, మిట్టపెల్లి సుదర్శన్‌, గొడుగు కుమారస్వామి సమావేశం దృష్టికి తీ సుకువచ్చారు. తక్కళ్లపెల్లిలో మిషన్‌ కాకతీయ పనులు ఎక్కడికక్కడే నిలి చిపోయాయని సర్పంచి కుమారస్వామి అన్నారు. వేసవిలోగా వరదకాలు వకు లిఫ్ట్‌ ఏర్పాటు చేసి మల్యాలకు సాగునీరందించాలని ఏఎంసీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌ ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ అధికారులు భాద్యతతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ టీసీ కొండపల్కుల రామ్మోహన్‌ రావు, ఏఎంసీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ పోతాని రవి, ఎంపీడీవో శైలజారాణి పాల్గొన్నారు.


Updated Date - 2021-01-17T04:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising