ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా మత్స్యగిరీంద్రస్వామి పౌర్ణమి జాతర

ABN, First Publish Date - 2021-02-28T06:14:56+05:30

కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి పౌర్ణమి జాతర శనివారం వైభవంగా సాగింది.

మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంకరపట్నం, ఫిబ్రవరి 27: కొత్తగట్టు  మత్స్యగిరీంద్రస్వామి పౌర్ణమి జాతర శనివారం వైభవంగా సాగింది. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా విష్ణుమూర్తి మత్స్య అవతారంలో కొత్తగట్టుగుట్టపై వెలిసి దర్శనమిస్తున్నాడు. మత్స్యగిరీంద్రస్వామిని దర్శించుకునేందుకు పౌర్ణమి రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తజనం పోటెత్తడంతో జాతర ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.   భక్తులకు  అసౌకర్యం కలుగకుండా పాలకవర్గం అన్ని ఏర్పాట్లు చేసింది. కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ శ్రీనివాస్‌, హుజూరాబాద్‌ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో  బందోబస్తు నిర్వహించారు. జాతర ఏర్పాట్లను ఆలయ ఈవో వెంకన్న  పర్యవేక్షించారు.

 స్వామివారిని దర్శించుకున్న కవ్వంపల్లి

మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ చైర్మన్‌ శ్యామ్‌రావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు.   కాంగ్రెస్‌  మండల అధ్యక్షుడు రావి సతీష్‌కుమార్‌, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, మహిళా కాంగ్రెస్‌ మండల అధ్యక్షురాలు పద్మ, ఎంపీటీసీ  తిరుపతి, నాయకులు మల్లారెడ్డి, రాజయ్య, తిరుపతి, జైపాల్‌రెడ్డి, ఇసామోద్దీన్‌, చంద్రమౌళి, శ్రీధర్‌, శ్రీనివాస్‌, దేవరాజు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T06:14:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising