ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాలలు ఆత్మగౌరవం కోసం సంఘటితంగా పోరాడాలి

ABN, First Publish Date - 2021-02-07T05:10:41+05:30

మాలలు తమ ఆత్మగౌరవం కోసం సంఘటితంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పిలు పునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న చెన్నయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

కళ్యాణ్‌నగర్‌, ఫిబ్రవరి 6: మాలలు తమ ఆత్మగౌరవం కోసం సంఘటితంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పిలు పునిచ్చారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగి న మాల మహానాడు నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశం ముగిసిపోలేదని, 2004 నాటి సుప్రీం కోర్టు తీరును పునఃసమీక్షించేందుకు మళ్లీ సుప్రీం కోర్టుకు తీసుకువెళుతున్నారన్నారు. వర్గీకరణ కోసం ఎంఆర్‌పీఎస్‌ తీవ్ర ప్రయత్నం చేస్తోందని, మా లలు చైతన్యవంతులై ప్రతి మాల గడప ఎంఆర్‌పీఎస్‌ కు ధీటుగా న్యాయపోరాటం చేయాల్సి ఉందన్నారు. ఉ మ్మడి రిజర్వేషన్లకు విఘాతం కలుగకుండా కాపాడుకునేందుకు, ధర్మయుద్ధం చేసేందుకు అందరూ కలిసి రావాలని కోరారు. మాలల బలాన్ని, బలగాలు పెంచుకు ని రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రక్షించుకోవాలని చెన్నయ్య పిలుపునిచ్చారు. మాలమహానాడు రాష్ట్రఅధ్యక్షుడు తాళ్లపల్లి రవి, జాతీయ ప్రధాన కార్యదర్శి వడాల భాస్కర్‌, రమేష్‌, గడ్డం నారాయణ, సోగాల సంజీవ్‌, గాదం రాధ, సంభోజి సుశీల, ఎరుకల పోషం, గొల్ల అంజయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-07T05:10:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising