ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ సభను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2021-10-18T05:36:35+05:30

ఎస్‌సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకు మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎంఆర్‌పీఎస్‌ రామగుం డం కార్పొరేషన్‌ అధ్యక్షులు పల్లెబాపు పిలుపునిచ్చారు.

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణ్‌నగర్‌, అక్టోబరు 17: ఎస్‌సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకు మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎంఆర్‌పీఎస్‌ రామగుం డం కార్పొరేషన్‌ అధ్యక్షులు పల్లెబాపు పిలుపునిచ్చారు. ఆదివారం కార్పొరేషన్‌ టీ జంక్షన్‌ వద్దఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని, వారికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించకుండా కొంతమంది అడ్డుతగులుతున్నార ని, వెంటనే ఎస్‌సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ఈ మహాసభ సికింద్రాబాద్‌లోని జీవీఆర్‌ గార్డెన్స్‌లో ఈనెల 24న జరుగనున్నట్టు పేర్కొన్నా రు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అబ్బయ్య నారాయణస్వామి, లోక్‌నాథ్‌ మురుగణ్‌ హాజరవుతారని, రామగుండం నియోజకవర్గం నుం చి పెద్దఎత్తున ఉద్యోగులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్‌పీఎస్‌ నాయకులు కన్నూరి ధర్మేందర్‌, ఎల్కలపల్లి వెంకన్న, కాసిపేట రాజయ్య, దశరథం, బొంకూరి రమేష్‌, జనగామ శ్రీనివాస్‌, అంబాల రాజేందర్‌, రాసపల్లి రవికుమార్‌, ఉప్పులేటి పర్వతాలు, మాతంగి కుమార్‌, స్వామి, అనీల్‌ కుమార్‌, వసుంధర, రాజేశ్వరి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T05:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising