సుల్తానాబాద్‌ను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా
ABN, First Publish Date - 2021-03-07T04:58:25+05:30
సుల్తానాబాద్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు.
- ఎమ్మెల్యే దాసరి
సుల్తానాబాద్, మార్చి 6: సుల్తానాబాద్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సుగ్లాంపల్లిలో రూర్బన్ పథకం కింద మంజూరైన రూ.35.69లక్షల నిధులతో చేపడుతున్న గోదాము నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శనివా రం భూమిపూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. సుల్తానాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రూర్బన్ నిధులు రూ.50లక్షలతో నిర్మించనున్న కోల్డ్ స్టోరేజీ పనులకు కూడా భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. సుల్తానాబాద్ ఏఎంసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మా ట్లాడుతూ వివిధ రకాల అభివృద్ది పనులతో సుల్తానాబాద్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా మన్నారు. ఈ మండలానికి రూర్బన్ నిధులు రావడం ఒక వరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బా లాజీరావు, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు కాసర్ల అనంతరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముత్యం సునీ తరమేష్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బుర్ర శ్రీనివాస్‌గౌడ్, వైస్‌చైర్మన్ అన్నేడి మహిపాల్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ పురం ప్రేంచందర్‌రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు పసెడ్ల మమత సంపత్, చింతల సునిత రాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-07T04:58:25+05:30 IST