ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామగుండాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా

ABN, First Publish Date - 2021-02-07T05:12:22+05:30

రామగుండం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ చెప్పారు.

పెడల్‌ బోట్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ 

గోదావరిఖని, ఫిబ్రవరి 6: రామగుండం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ చెప్పారు. శనివారం గోదావరి పుష్కర ఘాట్‌ వద్ద అడ్వెంచర్‌ ఆఫ్‌ ఆక్వా టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెడల్‌ బోట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు నీళ్లు లేక ఎండిన గోదావరినది కాళేశ్వరం ప్రాజెక్టుతో నేడు గోదావరికి జలకళ వచ్చిందన్నారు. గోదావరిలో రెండు సార్లు తెప్పల పోటీలను నిర్వహించామని, అంతేకాకుండా పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆహ్లాదంగా గడిపేలా 80సీట్ల బోట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఈ బోట్లను త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. అనంతరం శిక్షకులకు లైఫ్‌ జాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, పెంట రాజేష్‌, కొమ్ము వేణుగోపాల్‌, మంచికట్ల దయాకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బొడ్డు రవీందర్‌, నారాయణదాసు మారుతి, కుంట సాయి, రాకం వేణు, గోలివాడ ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T05:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising