ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చురుగ్గా మహాశివరాత్రి ఏర్పాట్లు

ABN, First Publish Date - 2021-02-25T05:17:59+05:30

వేములవాడ రాజరాజే శ్వర క్షేత్రం మహాశివరాత్రి జాతరకు ముస్తాబవుతోంది. మార్చి 10, 11, 12 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహిం చనున్న ఉత్సవాల కోసం కోటి 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం పడమర ద్వారానికి రంగులు వేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రూ.కోటి 70 లక్షలతో పనులు


వేములవాడ, ఫిబ్రవరి 24: వేములవాడ రాజరాజే శ్వర క్షేత్రం మహాశివరాత్రి జాతరకు ముస్తాబవుతోంది. మార్చి 10, 11, 12 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహిం చనున్న ఉత్సవాల కోసం కోటి 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆల యాలకు రంగులు వేసే పని కొనసాగుతోంది. ఆల యాలను విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. యాత్రీకులు బస చేసేందుకు వీలుగా ఆలయ పరిసరాలతోపాటు గుడిచెరువు ప్రాంగణంలో చలువ పందిళ్లు వేస్తున్నారు. పట్టణంలో పలు చోట్ల స్వాగత తోరణాలతోపాటు శివార్చన పేరిట సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. యాత్రికుల వాహనాల కోసం పార్కింగ్‌ స్థలాలను, తాత్కాలిక బస్టాండ్లను సిద్ధం చేస్తున్నారు. చలివేంద్రాలు, 70 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు.


మూలవాగు బ్రిడ్జి వద్ద రోడ్డు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. బైపాస్‌ రోడ్డు వెంట డివైడర్ల మధ్యలోని చెట్లను రంగులతో అలంకరిస్తున్నారు. రూ.10 లక్షల అంచనా వ్యయంతో ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, ఆర్చిగేట్లు, ధర్మగుండం, క్యూలైన్‌ కాంప్లెక్స్‌లకు రంగులు వేసే పని వేగంగా సాగుతోంది. విద్యుద్దీపాల అలంకరణకు రూ.26 లక్షలు  కేటాయించారు.  రూ.26 లక్షలతో చలువ పందిళ్ల ఏర్పాటు చేపట్టారు.




తాత్కాలిక బస్టాండ్‌, బారికేడ్లు, పార్కింగ్‌ స్థలాల ఏర్పాటు కోసం రూ.4 లక్షలు కేటాయించారు. 4 లక్షల అంచనా వ్యయంతో మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. శివార్చన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం గుడిచెరువు ప్రాంగణంలో వేదిక ఏర్పాటు, అలంకరణ, లైటింగ్‌, విద్యుద్దీపాల ఏర్పాటుకు అదనంగా రూ.26 లక్షలు, కళాకారులకు పారితోషికం కోసం అదనంగా రూ.18 లక్షలు కేటాయించారు. మహాశివరత్రిర జాతర సందర్భంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఆలయ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-02-25T05:17:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising