ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-04-11T06:07:33+05:30

లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని 9వ అడిషనల్‌ సెషన్స్‌ జిల్లా జడ్జి జాన్సన్‌ అన్నారు. శనివారం సిరిసిల్ల జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహిం చారు.

లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్న జిల్లా జడ్జి జాన్సన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల క్రైం, ఏప్రిల్‌ 10:  లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని 9వ అడిషనల్‌ సెషన్స్‌ జిల్లా జడ్జి  జాన్సన్‌ అన్నారు. శనివారం సిరిసిల్ల జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లు కక్షిదారులకు ఎంతో ఉపయోగకరమని,  ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరిగే పని తప్పుతుందని అన్నారు. రాజీ చేసుకోవడమే రాజమార్గమ న్నారు. లోక్‌ అదాలత్‌లో పరిష్కారమైన కేసుల్లో పైకోర్టుకు వెళ్లే వీలులేదన్నారు. నిరుపేదలు న్యాయం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని, ఉచిత న్యాయం పొందాలని అన్నారు. లోక్‌ అదాలత్‌తో 250 కేసులు పరిష్కారమయ్యాయని వీటి ద్వారా దాదాపు రూ.10 లక్షల చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఇందులో ఏడీజే కోర్టు పరిధిలో 5, సివిల్‌ కోర్టులో 5, పీడీఎం కోర్టులో 104, ఏడీఎం కోర్టులో 146 కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు.  ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి, అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి మంజుల, లోక్‌ అదాలత్‌ సభ్యులు చింతోజుభాస్కర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వసంతం, కార్యదర్శి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


వేములవాడలో..

వేములవాడ: వేములవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో  194 కేసులను పరిష్కరించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి  వినిల్‌ కుమార్‌ ఈ సందర్భంగా వివిధ కేసులకు సంబంధించి కక్షిదారుల పరస్పర రాజీతో కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. లోక్‌ అదాలత్‌ సభ్యులు బొజ్జ కనకయ్య, గుడిసె మనోజ్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిట్టల భూమేశ్‌, సీనియర్‌ న్యాయవాదులు నేరెళ్ల తిరుమల్‌గౌడ్‌, గుండా రవి, అంజయ్య, అనిల్‌కుమార్‌, రాజ్‌కుమార్‌, సంపత్‌, ప్రశాంత్‌, నరేందర్‌, మహేందర్‌, నర్సింగరావు, మనోహర్‌, దివాకర్‌, గంగారాజం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T06:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising