ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారి కోసం భూములు ఇవ్వలేం

ABN, First Publish Date - 2021-03-06T06:37:19+05:30

కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారి బైపాస్‌ కోసం తమ వ్యవసాయ భూములు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పారు.

) హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌, మార్చి 5: కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారి బైపాస్‌ కోసం తమ వ్యవసాయ భూములు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బైపాస్‌ రోడ్డును రద్దు చేయాలని గతంలోనే స్థానిక మంత్రికి, ఎంపీకి, జిల్లా కలెక్టర్‌, ఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. సింగాపూర్‌, సిర్సపల్లి, కొత్తపల్లి, రాంపూర్‌, హుజూరాబాద్‌, పెద్దపాపయ్యపల్లి, కందుగుల గ్రామాల మీదుగా జాతీయ రహదారి 563బైపాస్‌ కోసం చేసిన ప్రతిపాదనతో అనేక మంది రైతులు పంట భూములను కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బైపాస్‌ రోడ్డు మూలంగా ప్రభుత్వానికి సైతం పెద్ద ఎత్తున ఖర్చు వస్తుందని తెలిపారు. పాత రహదారిని వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో రైతులు విష్ణువర్ధన్‌, మల్లిఖార్జున్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, చక్రపాణి, చంద్రయ్య, రాజ్‌కుమార్‌, తిరుపతి, కనుకయ్య, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T06:37:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising