ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగిత్యాలకు కిసాన్‌ రైలు

ABN, First Publish Date - 2021-04-13T05:41:10+05:30

రైతుల సౌలభ్యం కొరకే కేంద్ర ప్రభుత్వం, భారత రైల్వే శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మామిడి పండ్ల ఎగుమతులను ఢిల్లీకి తరలించేందుకు కిసాన్‌ రైలును ఏర్పాటు చేస్తున్నామని సికింద్రాబాద్‌ సౌత్‌ జోన్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సుఖేష్‌ దీపక్‌ పేర్కొన్నారు.

రైలులోకి మామిడిని లోడ్‌ చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- లింగంపేట రైల్వేస్టేషన్‌లో ప్రారంభం

- ఢిల్లీకి మామిడి పండ్ల రవాణా ప్రారంభం 

జగిత్యాల అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 12: రైతుల సౌలభ్యం కొరకే కేంద్ర ప్రభుత్వం, భారత రైల్వే శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మామిడి పండ్ల ఎగుమతులను ఢిల్లీకి తరలించేందుకు కిసాన్‌ రైలును ఏర్పాటు చేస్తున్నామని సికింద్రాబాద్‌ సౌత్‌ జోన్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సుఖేష్‌ దీపక్‌ పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల లింగంపేట రైల్వేస్టేషన్‌లో సాయంత్రం 5గంటలకు కమర్షియల్‌ మేనేజర్‌ సుఖేష్‌ దీపక్‌ చేతులమీదుగా ఈ కిసాన్‌ రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సికింద్రాబాద్‌లో డివిజనల్‌ మేనేజర్‌ ఏకే గుప్తా వెబ్‌ ద్వారా ప్రారంభించారని, లింగంపేట రైల్వే స్టేషన్‌లో రిబ్బన్‌ కట్‌ చేసి రైలును ప్రారంభించామన్నారు. ఈ రైలు సోమవారం సాయంత్రం 5గంటల నుంచి మామిడి లోడింగ్‌ అయ్యి, అర్ధరాత్రి వరకు లోడింగ్‌ పూర్తి అవుతుం దన్నారు. రాత్రి 1గంటకు రైలు రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరి మంగళవారం రాత్రి 1గంట వరకు 24గంటల్లో  ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌కు చేరుకుంటుందన్నారు. ఈ రైలు ద్వారా 20బోగీల్లో సుమారు 500 టన్నుల సామర్థ్యం గల మామిడి పండ్లను ఢిల్లీకి రవాణా చెయ్యవచ్చునన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, సౌలభ్యం కొరకు 50శాతం రవాణా సబ్సిడీతో ఉపయోగకరంగా ఉంటుంద న్నారు. 24 గంటల్లో సరుకు ఢిల్లీకి చేరడంతో సమయం ఆదాతో పాటు, రవాణా భారం తగ్గి రైతులకు లాభదా యకంగా ఉంటుందన్నారు. రైతుల అవసరం మేరకు  రైలును నడిపేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈ కార్య క్రమంలో రామగుండం ఏవో శుభమ్‌ జైన్‌, కమర్షియల్‌ ఇన్స్‌పెక్టర్‌ దేవేందర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-04-13T05:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising