ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జై భీం’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన కేసీఆర్

ABN, First Publish Date - 2021-08-16T20:50:11+05:30

హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. సభలో ‘జై భీం’ అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్: హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. సభలో ‘జై భీం’ అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దళిత బంధుతో కొత్త చరిత్రను సృష్టిస్తామని చెప్పారు. ఈ పథకంతో ఎస్సీలకు ఎంతో మేలు కలుగుతుందని సీఎం తెలిపారు. దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు మహా ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం విజయం సాధిస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాది కిందటే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నామని, అయితే కరోనా వల్ల ఆలస్యమైందని కేసీఆర్ పేర్కొన్నారు. 


‘‘రైతుబంధు పథకం అద్భత ఫలితాలు సాధిస్తోంది. కరీంనగర్‌లోనే రైతుబీమా ప్రారంభించాను. తెలంగాణ ఉద్యమంలోనూ సింహగర్జన సభ కరీంనగర్‌లోనే జరిగింది. అద్భుతమైన మరో ఉద్యమానికి కరీంనగర్‌లోనే శ్రీకారం చుట్టాము. తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలి. దళితబంధు కచ్చితంగా విజయవంతం అవుతుంది. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి పట్టుదల ఉండాలి. 25 ఏళ్లక్రితం నుంచే దళితుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అవకాశాలు, ఆస్తుల లేక దళితులు అణగారిపోయి ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న పని 75 ఏళ్ల కిందే మొదలు పెట్టి ఉంటే ఈ దుస్థితి ఉండేదా? హుజురాబాద్‌లో దళితబంధు అమలు ఒక ప్రయోగశాల లాంటిది. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళితబంధు వర్తింపు. ఎస్పీలలో నిరుపేదలకు ముందుగానే దళితబంధు నిధులు. దళితబంధును విజయవంతం చేసే బాధ్యత విద్యార్థులపై ఉంది. తెలంగాణలో 17 లక్షలకుపైగా దళిత కుటుంబాలున్నాయి’’ అని కేసీఆర్‌ తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో  కేసీఆర్‌ చేతులమీదుగా దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకంగా ద్వారా 15 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయ చెక్కులను కేసీఆర్ అందించనున్నారు.


Updated Date - 2021-08-16T20:50:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising