ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు కాషాయ తీర్థం..!

ABN, First Publish Date - 2021-06-15T06:31:01+05:30

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మహిళల్లో ముందు వరుసలో ఉన్న తుల ఉమ రాజకీయ ప్రస్థానం కథలాపూర్‌ జడ్పీటీసీగా ఆరంభం కాగా జడ్పీ ఛైర్‌ప ర్సన్‌గా పదవిని చేపట్టిన తుల ఉమ ఎట్టకేలకు బీజెపీ తీర్థం పుచ్చుకున్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీలో చేరిన తుల ఉమ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ ఎమ్మెల్యేతో విభేదాలే కారణం

ఫ జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ ప్రస్థానం

కథలాపూర్‌, జూన్‌ 14 : తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మహిళల్లో ముందు వరుసలో ఉన్న తుల ఉమ రాజకీయ ప్రస్థానం కథలాపూర్‌ జడ్పీటీసీగా ఆరంభం కాగా జడ్పీ ఛైర్‌ప ర్సన్‌గా పదవిని చేపట్టిన తుల ఉమ ఎట్టకేలకు బీజెపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉద్యమాల్లో తన కంటూ ప్రత్యేకత చాటుకున్న ఉమను సీఎం కేసీఆర్‌ గుర్తించి ముందస్తుగానే జడ్పీ ఛైర్‌పర్స న్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా, నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జిగా నియమించి పలు పదవుల్లో కొనసాగించారు. కథలాపూర్‌ మండలం వేములవాడ నియోజకవర్గంలో ఉండగా స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో మొదటి నుంచి అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తుల ఉమ స్వస్థలం మేడిపల్లి మండలంలోని మోత్కూరావుపేట కాగా ఆ మండల ప్రజలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఉమ ఉమ్మడి జిల్లాకు జడ్పీ చైర్‌పర్సన్‌ కాగా  ఎమ్మెల్యే పర్యటించిన సందర్భాల్లో అనేక సార్లు ఇరువురి మధ్య ఎడమొహం పెడమొహంగానే పరిస్థితి కొనసాగింది. ఇద్దరి మధ్య రాజకీయంగా ఆగాధం పెరిగిన నేపథ్యంలో తాను టీఆర్‌ఎస్‌లో ఇమడలేననే భావన ఎదురై గత 2019 శాసనసభ సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెబుతున్నారనే వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే బీజెపీలో చేరుతున్నారని ప్రచారం జరగగా అధిష్టానం బుజ్జగింపు లతో ఆలోచన విరమించుకున్నారని తెలిసింది. మొదటి నుంచి ఈటల రాజేందర్‌తో సత్సంబం ధాలు కలిగి ఉన్న తుల ఉమ ఆయనతో పాటే ఢిల్లీలో బీజేపీలో చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీలో ఉంటుండగా తరచూ నియోజకవర్గంలో పర్యటించి  తన కేడర్‌ను ఉత్తేజంలో ఉంచడానికి ముమ్మర ప్రయత్నాలు కూడా చేసుకున్నారు. వేములవాడ నుంచి బీజెపీ టికెట్‌ తుల ఉమకు ఇస్తారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఉమకు ఉన్న కేడర్‌ను బీజెపీలో చేర్చుకునే ప్రయత్నాలు ఇప్పటికే ఆరంభమయినట్టు తెలుస్తోంది. 


Updated Date - 2021-06-15T06:31:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising