ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలకు పుట్టినిల్లు కరీంనగర్‌

ABN, First Publish Date - 2021-01-16T05:10:38+05:30

క్రీడలకు కరీంనగర్‌ పుట్టినిల్లు వంటిదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో శ్రీగురుగోబింద్‌సింగ్‌ మహిళల రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళల రాష్ట్రస్థాయి హాకీటోర్నమెంట్‌ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, జనవరి 15: క్రీడలకు కరీంనగర్‌ పుట్టినిల్లు వంటిదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో శ్రీగురుగోబింద్‌సింగ్‌ మహిళల రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం క్రీడాకారులకు చేయూతనందిస్తూ వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేస్తోందన్నారు. సిక్కుల మతగురువైన గురుగోబింగ్‌సింగ్‌ పేరుతో హాకీ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.  ఈ టోర్నమెంట్‌లో 10 టీంలు పోటీపడుతుండగా ఈ నెల 17న ముగియనున్నాయి. పోటీల్లో ఎనిమిది జిల్లాలు పాల్గొంటున్నాయి. పోటీలకు విశిష్ఠ అతిథిగా విచ్చేసిన హాకీ క్రీడాకారిణి సౌందర్యను మంత్రి గంగుల కమలాకర్‌ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రవు, హాకీ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌సింగ్‌, కార్యదర్శి సురేందర్‌సింగ్‌, తెలంగాణ హాకీ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రెటరీ హర్మిత్‌కౌర్‌, జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నందెల్లి మహిపాల్‌, గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising