ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటింటా ఫీవర్‌ సర్వే ప్రారంభం

ABN, First Publish Date - 2021-05-07T06:52:16+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటా ఫీవర్‌ సర్వే కార్యక్రమం జిల్లాలో గురువారం ప్రారంభం అయింది. ఇంటింటికి వెళ్లి జలుబు, దగ్గు, జ్వరం, త లనొప్పి వంటి కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై సర్వే చేయడంతో పాటు మందులు కూడా అందించే కార్యక్రమం చేపట్టారు.

గర్జనపల్లిలో సర్వే నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 255 గ్రామపంచాయతీలు.. 482 బృందాలు 

- 1,400 మంది సిబ్బంది

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటా ఫీవర్‌ సర్వే కార్యక్రమం జిల్లాలో గురువారం ప్రారంభం అయింది. ఇంటింటికి వెళ్లి జలుబు, దగ్గు, జ్వరం, త లనొప్పి వంటి కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై సర్వే చేయడంతో పాటు మందులు కూడా అందించే కార్యక్రమం చేపట్టారు. లక్షణాలు తీ వ్రంగా ఉన్నవారికి పరీక్షలు కూడా చేయిస్తున్నారు. ఇంటింటా ఫీవర్‌ సర్వేను గురువారం ప్రారంభించగా నాలుగు రోజుల్లో పూర్తి చేసే విధంగా నిర్ణయించారు. సర్వే బృందంలో ఆశా కార్యకర్త, అంగన్‌వాడీ టీచర్‌, ఏఎన్‌ఏంలతో పాటు పంచాయతీ కార్యదర్శులు గ్రా మాల్లో తిరుగుతూ సర్వేను మొదలు పెట్టారు. ప్రస్తు తం కొవిడ్‌ టెస్టులకు సంబంధించి కిట్‌ల కొరత, వ్యా క్సిన్‌ కొరత, అక్సిజన్‌, బెడ్లు దొరకని పరిస్థితుల్లో కనీ సం లక్షణాలను ముందే గుర్తించి చికిత్సలు అందిం చడానికి సర్వే దోహాదపడుతుందని అధికారులు చెబుతున్నారు. 

- జిల్లాలో 482 బృందాలు.. 

జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, లక్షా 16వేల 176 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల్లో లక్షణా లు ఉన్నావారితో పాటు గతంలో టెస్టులు చేయించు కున్న వారు, పాజిటివ్‌ వచ్చిన వారి లెక్క కూడా తేల నుంది. కుటుంబాలకు సంబంధించిన సర్వేకు 482 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కొ కుటుంబానికి 500 కుటుంబాల చొప్పున కేటాయించారు. సర్వే చేసే సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఇంటి బ యటే దూరంగా ఉంటూ సర్వేను కొనసాగిస్తున్నారు. 


Updated Date - 2021-05-07T06:52:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising