ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాభివృద్ధికి ఇందిరమ్మ సేవలు చిరస్మరణీయం : జంగపల్లి ఐలయ్య

ABN, First Publish Date - 2021-10-31T20:49:27+05:30

ఇవాళ దేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి. ఈ సందర్బంగా అక్కన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఐలయ్య మాట్లాడుతూ.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ : ఇవాళ దేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి. ఈ సందర్బంగా అక్కన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఐలయ్య మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉంటూ భారత దేశాభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశ పెట్టి, వివిధ కార్యక్రమాల ద్వారా దేశ పురోగతికి తొడ్పాడటం జరిగిందన్నారు. అందులో భాగంగానే  బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి కార్యకలాపాలు చేపట్టడంతో ఆమె ప్రజల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు. ఇది సహించని ఆమె వ్యతిరేకులు ఆమెకు వ్యతిరేకంగా ఎలాగైనా ఇందిరాగాంధీని పదవి నుంచి తొలగించాలని ఎత్తులు వేసే నేతలు ‘ఇందిరా హటావో’ అనే నినాదంతో ప్రచారం మొదలు పెట్టారని ఆయన తెలిపారు. 


ఎత్తులకుపై ఎత్తులు వేయగల నేర్పరి ఇందిర ‘గరీబీ హటావో- దేశ్ బచావో అంటే పేదరికాన్ని పారద్రోలండి దేశాన్ని బతికించండి’ అనే నినాదంతో తన చాతుర్యాన్ని చాటుకొని దేశ ప్రజల మన్ననలు పొందిందని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి, బబ్బూరి యాదయ్య, కాశబోయిన యాదగిరి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చొక్కం గణేష్, గుగులోత్ రాజు నాయక్, నకిర్తి మునిరాజ్, పోతారవేణి రాజు, చింతల బాలరాజు, మేడబోయిన సాంబరాజు, బెజ్జంకి శంకర్, అమరగొండ రాకేష్, భూక్య తిరుపతి, గొట్టే సాయికుమార్, నకీర్తి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-31T20:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising