ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షోభంలోనూ సంక్షేమ పథకాల అమలు

ABN, First Publish Date - 2021-05-10T06:03:14+05:30

కరోనా సంక్షోభ సమయంలో సైతం ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని, అందులో భాగంగా రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు ప్రభుత్వం కానుకలు పంపిణీ చేస్తుందని వైస్‌ ఎంపీపీ ఆవుల సత్తయ్య, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ బోయపోతు గంగాధర్‌ అన్నారు.

కానుకలను పంపిణీ చేస్తున్న వైస్‌ ఎంపీపీ సత్తయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొల్లపల్లి, మే 9: కరోనా సంక్షోభ సమయంలో సైతం ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని, అందులో భాగంగా రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు ప్రభుత్వం కానుకలు పంపిణీ చేస్తుందని వైస్‌ ఎంపీపీ ఆవుల సత్తయ్య, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ బోయపోతు గంగాధర్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మసీదు వద్ద వైస్‌ ఎంపీపీ, శ్రీరాముల పల్లెలో ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మండల కో-ఆప్షన్‌ సభ్యులు మహ్మాద్‌ ఆలీతో కలిసి ప్రభుత్వం మంజూరు చేసిన కట్నకానుకలను ముస్లిం వేరువేరుగా పంపిణీ చేశారు.  కరోనా కష్టకాలంలో సైతం మైనారిటీల సంక్షేమాన్ని గుర్తెరిగి పండుగ కానుకలను పంపిం చడంపై ముస్లింలు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంజూరుకు కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  కార్యక్రమాల్లో వైస్‌ ఎంపీపీ ఆవుల సత్తయ్య, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ బోయపోతు గంగాధర్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యులు మహమూద్‌ ఆలీ, నాయకులు బషీర్‌, సల్మాన్‌, సమీర్‌, రియాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T06:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising