ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ లేఅవుట్లపై కఠినంగా వ్యవహరించాలి

ABN, First Publish Date - 2021-07-28T06:02:00+05:30

జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా వెలుస్తున్న అక్రమ లే అవుట్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనా రాయణ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి టౌన్‌, జూలై 27: జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా వెలుస్తున్న అక్రమ లే అవుట్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనా రాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్‌ అధికారులతో నిర్వ హించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అను సరించి ఇళ్ల స్థలాల లేఅవుట్లు ఉండాలని, నిబంధనల విరుద్ధంగా చాలా లే అవుట్లు వెలిసినట్లుగా తెలుస్తున్నదని అన్నారు. అనుమతి లేకుండా వెలిసిన లే అవుట్లను తొలగించాలన్నారు. టీ బీపాస్‌ ద్వారా భవనాల అనుమతుల కోసం వచ్చే దరఖాస్తు లను ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో 176 దరఖాస్తులు రాగా, ఇందులో 71 ఇళ్లకు అనుమతులు ఇచ్చారని, 57 దరఖాస్తులను తిరస్కరించారని, 48 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని తెలిపా రు. మున్సిపల్‌ బడ్జెట్‌లో 10 శాతం నిధులను గ్రీన్‌ బడ్జెట్‌ కింద కేటాయించిన నిధు లను మొక్కల పెంపకం, సంరక్షణకు వెచ్చించాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మున్సిపల్‌ కమిషనర్లు మారుతీ రావు, శ్రీని వాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T06:02:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising