ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ సమస్య ఉన్నా..ఫోన్‌ చేయండి

ABN, First Publish Date - 2021-12-05T05:51:48+05:30

ఎలాంటి సమస్య ఉన్నా ఫోన్‌ చేయండి.. ఆందోళన చెందకండి..అంటూ తాటిపెల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‌ భరోసా ఇచ్చారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురుకుల పాఠశాల విద్యార్థినులకు ఎమ్మెల్యే రవిశంకర్‌ భరోసా 

మల్యాల, డిసెంబరు 4: ఎలాంటి సమస్య ఉన్నా ఫోన్‌ చేయండి.. ఆందోళన చెందకండి..అంటూ తాటిపెల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‌ భరోసా ఇచ్చారు. పాఠశాలకు చెందిన విద్యార్థినులు రెండు రోజుల క్రితం కరోనా బారిన పడగా ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్‌ శనివారం పాఠశాలను సందర్శించారు. కరోనా బారిన పడ్డ వారిని హోంఐసోలేషన్‌కు పంపించారు. పాఠశాలలోని తర గతి గదులను తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. ఏమైన సమస్యలు ఉం టే తనకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. వైద్యులు కూడా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చన్నీటి స్నానంతో ఇబ్బందు లు పడుతున్నామని తెలుపడంతో సోలార్‌ వాటర్‌ హీటర్లు వెంటనే ఏ ర్పాటు చేయాలని ఫోన్‌ ద్వారా కలెక్టర్‌ను కోరారు. పాఠశాలలో సౌక ర్యాలపై గురుకుల డైరెక్టర్‌తో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట డీఎంహెచ్‌ వో శ్రీధర్‌, జడ్పీటీసీ రామ్మోహన్‌రావ్‌, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌లు సుదర్శన్‌, తిరుపతిరెడ్డి, రమేశ్‌ విండో చైర్మన్లు రాంలింగారెడ్డి, మధుసూ ధన్‌రావ్‌, మల్యాల, కొడిమ్యాల టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు జనగాం శ్రీనివాస్‌, వెంకటేశ్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎం.డీ.అజర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు ఆసం శివకుమార్‌, చినదుర్గయ్య తదితరులు ఉన్నారు.

మరో ఇద్దరికి నెగెటివ్‌

కరోనా బారిన పడ్డ 9మంది విద్యార్థుల్లో ఒక్క రోజులోనే శుక్రవారం ముగ్గురకి నెగెటివ్‌ రిపోర్ట్‌ రాగ శనివారం మరో ఇద్దరికి నెగెటివ్‌ వచ్చి నట్లు పాఠశాల ప్రిన్షిపాల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. దీంతో నలుగురు మా త్రమే ప్రస్తుతానికి కరోనా చికిత్స పొందుతున్నారు. అయితే ఇందులో నూ ఒక్కరికీ కరోనా అనుమానస్పదంగా ఉందని అయినప్పటికీ హోం ఐసోలేషన్‌లోనే ఉంచినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-05T05:51:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising