ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటీకరిస్తే కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదు

ABN, First Publish Date - 2021-10-25T06:22:15+05:30

సింగరేణిని ప్రైవేటీకరిస్తే కేసీఆర్‌ ప్రభు త్వానికి కార్మికుల నుంచి వ్యతిరేకత తప్పదని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సాంబశివరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని ఆపేలా కేంద్రంపై ఒత్తిడితేవాలి 

- మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

గోదావరిఖని, అక్టోబరు 24: సింగరేణిని ప్రైవేటీకరిస్తే కేసీఆర్‌ ప్రభు త్వానికి కార్మికుల నుంచి వ్యతిరేకత తప్పదని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతు న్నదని అన్నారు. పరాడి సాధించుకున్న చట్టాలను సవరించి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం రంగ  సంస్థల ను ప్రైవేట్‌ కంపెనీలకు ఇవ్వడానికి పూనుకున్నట్టు సాంబశివరావు తెలి పారు. దానిలో భాగంగా సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్‌ వారికి ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానించినట్టు ఆరోపించారు. సింగరేణిలో ప్రైవేటీకరణ జరిగితే ముఖ్యంగా కార్మిక వర్గంతో పాటు తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోవడంలో కేసీఆర్‌ ప్రభత్వం వైఫల్యం చెందిందని సాంబశివరావు విమర్శించారు. సింగరేణిలో ప్రైవేటీకరణ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య మాట్లాడారు. గతంలో మాదిరిగానే సింగ రేణి స్వయంగా బొగ్గు తవ్వకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 26న సింగరేణి వ్యాప్తంగా గనులు, డిపార్ట్‌వెంట్లపె ధర్నాలు నిర్వహించి మెమోరాండాలు ఇవ్వ డం జరుగతుందని తెలిపారు. 31న సింగరేణి ప్రైవేటీక రణకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలతో అఖిలపక్ష సమావేశం గోదావరిఖనిలో ఏర్పాటు చేసినట్టు సీతా రామయ్య పేర్కొన్నారు. అన్ని సంఘాలతో చర్చించి ప్రైవే టీకరణకు వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాన్ని రూపొం దిస్తామని తెలిపారు. ఈసమావేశంలో వైవీ రావు, ప్రకాష్‌, మడ్డి ఎల్లయ్య, రాజారత్నం, మోహన్‌, కనకరాజ్‌, మద్దెల దినేష్‌, రంగు శీను, మహేష్‌, ప్రసాద్‌, రవీందర్‌, రామస్వామిలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T06:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising