ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Huzurabad Results : 22 రౌండ్లలో తుది ఫలితం.. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాలు.. బాద్‌షా ఎవరో..!?

ABN, First Publish Date - 2021-11-02T12:40:47+05:30

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వివరిం చారు. ఓట్ల లెక్కింపు కోసం స్థానిక ఎస్సారార్‌ కళాశాలలో రెండు హాళ్లలో ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ కారణంగా భౌతికదూరం పాటించేందుకు వీలుగా ఒక్కో హాల్‌లో 7 చొప్పున టేబుళ్లను వేసి 14 కౌంటింగ్‌ టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు.


భారీ బందోబస్తు

కౌంటింగ్‌ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ నేతృత్వంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో అడిషనల్‌ డీసీపీలు-2, ఏసీపీలు-6, సీఐలు 14, ఎస్‌ఐలు 41, సిబ్బంది 500 మందితో పాటు కేంద్రబలగాలు, రాష్ట్ర సాయుధ బలగాలతో పటిష్టమైన మూడంచెల భద్రత ఏర్పా టు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల పరిసరాలు మొత్తం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. 


22 రౌండ్‌లలో లెక్కింపు..

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ముందుగా ఏజెంట్ల సమక్షంలో 753 పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక్కో రౌండ్‌లో 14 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. రెండు హాళ్లలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ అబ్జర్వర్‌, మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. ఉదయం 9 గంటల వరకు తొలి రౌండ్‌ ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్‌కు కనీసం 30 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితం వెల్లడవుతుంది.


ఇదిలా ఉంటే.. కొవిడ్‌ కారణంగా కౌంటింగ్‌ కోసం వచ్చే రాజకీయ పార్టీల సిబ్బంది మాస్కులు ధరించి రావా లని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది అందరిని రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నవారిని ఎం పిక చేశారు. వీరందరికీ ముందుజాగ్రత్త చర్యగా  కొవిడ్‌ నిర్ధారణ టెస్టు కూడా నిర్వహించారు.

Updated Date - 2021-11-02T12:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising