ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్

ABN, First Publish Date - 2021-10-27T18:30:50+05:30

హుజురాబాద్ ఉపఎన్నికను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపు కోసం పకడ్బందిగా వ్యూహాన్ని అమలు చేస్తోంది. దుబ్బాకతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. హుజురాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం అధికారికంగా, అనధికారికంగా సుమారు రూ. 3వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. అందులో రూ. 2వేల కోట్లు దళిత బంధు పథకానికి ఉపయోగించగా.. మిగిలిన వెయ్యి కోట్లు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించింది. ఎందుకంటే ఈ ఎన్నిక వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికలకు రిఫరెండంగా మారబోతోంది. ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి ఫలాలే తమ అభ్యర్థిని గెలిపిస్తుందని టీఆర్ఎస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఎన్నికను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా సీరియస్‌గా తీసుకున్నాయి.


కాగా హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం బుధవారం సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. కోవిడ్ నిబంధనల ప్రకారం ఈ నెల 30న జరిగే పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉంది. ఎన్నికలను ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు సవాల్‌గా స్వీకరించాయి. బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరఫున బలుమూరి వెంకట్... ప్రచారంలో నువ్వా.. నేనా.. అనే రీతిలో పోటీపడుతున్నారు. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి.

Updated Date - 2021-10-27T18:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising