ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా తీజ్‌ ఉత్సవాలు

ABN, First Publish Date - 2021-09-03T06:42:35+05:30

మండలంలోని బుగ్గరాజేశ్వర తండాలో గురువారం సాయంత్రం గిరిజనులు తీజ్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

నృత్యాలు చేస్తున్న గిరిజన మహిళలు, యువతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అలరించిన సాంప్రదాయ నృత్యాలు 

ఎల్లారెడ్డిపేట, సెస్టెంబరు 2:  మండలంలోని బుగ్గరాజేశ్వర తండాలో గురువారం సాయంత్రం గిరిజనులు తీజ్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. యువతులు ప్రత్యేక పందిరిని ఏర్పాటు చేసి వారం రోజుల పాటు ఉపవాస దీక్షలతో బుట్టల్లోని గోధుమ గింజలకు నీరును పోశారు. డప్పుచప్పుళ్ల నడమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పందిరిపై నుంచి బుట్టలను తీసి గ్రామ శివారులోని నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు. గిరిజన యువతులు, మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రజిత, గ్రామ పెద్దలు తిరుపతినాయక్‌, రూప్లా, రమేశ్‌, రవి, బాలు, లాల్‌సింగ్‌, హెరమాన్‌, మోహన్‌, దేవేందర్‌  తదితరులు పాల్గొన్నారు.

ఫ గంభీరావుపేట: మండలంలోని ముచ్చర్లతండాలో గురువారం తీజ్‌ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. తీజ్‌ ఉత్సవాల్లో బాగంగా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారు. గోధుమ బుట్టలతో సంప్రదాయ నృత్యాలతో తీజ్‌ ఉత్సవాలను ఆనందోత్సవాల మద్య జరుపుకున్నారు. అనంతరం గ్రామ సమీప చెరువులో నిమజ్జనం చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు తీజ్‌ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T06:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising