జీపీఎఫ్ ఖాతాలను నూతన జిల్లాలకు బదిలీ చేయాలి
ABN, First Publish Date - 2021-09-14T06:15:00+05:30
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు జడ్పీ జీపీఎఫ్ ఖాతాలను తక్షణమే బదిలీ చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కని నవీన్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, సెప్టెంబరు 13: రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు జడ్పీ జీపీఎఫ్ ఖాతాలను తక్షణమే బదిలీ చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కని నవీన్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం టీఎస్ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపి సీఈవో గౌతంరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ 2016 అక్టోబరులో నూతన జిల్లాలు ఏర్పడ్డాయని అన్నారు. నూతన జిల్లాలకు రాష్ట్రపతి అమోదం లభించిందని హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో జిల్లా పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ మాత్రం ఇంకా పాత జిల్లా పరిషత్‌లలోనే కొనసాగుతోందని అన్నారు. పీఎఫ్ నుంచి రుణాలు పర్సనల్ పేమెంట్‌లు అవసరమైన ఉద్యోగులు కొత్త జిల్లాలో పనిచేస్తూ పాత జిల్లా పరిషత్ సీఈవోకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి పీఎఫ్ ఖాతాలను ఉద్యోగులు పనిచేస్తున్న కొత్త జిల్లాల వారీగా ఆయా జిల్లా పరిషత్‌లకు తక్షణమే బదిలీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జంగిటి రాజు, అడిట్ కమిటీ కన్వీనర్ కొండికొప్పుల రవి, జిల్లా కోఽశాధికారి రవీందర్, జిల్లా కార్యదర్శులు అడెపు శివకుమార్, మధుసూదన్, వెంకటేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-14T06:15:00+05:30 IST