ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను గాలికి వదిలేసిన ప్రభుత్వాలు

ABN, First Publish Date - 2021-05-11T06:10:54+05:30

కరోనా మహమ్మారి కుటు ంబాలకు కుటుంబాలను కబలిస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజలను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌ మండిపడ్డారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని తిప్పా పూర్‌ గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తిప్పాపూర్‌లో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ టౌన్‌, మే 10 : కరోనా మహమ్మారి కుటు ంబాలకు కుటుంబాలను కబలిస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజలను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌ మండిపడ్డారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని తిప్పా పూర్‌ గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రిలో పడకలు దొరకకపోవడంతో చాలా మంది  ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని, ఉన్న ఆస్తులను అమ్ముకునే పరిస్థితి దాపురించిందని అన్నారు. ఒక వైపు రాష్ట్రంలో కరోనా విజృం భిస్తోందని, మరోవైపు  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లేకపో వడం బాధాకరమని అన్నారు. పట్టణ ప్రజలు కరోనాతో మృతి చెందితే కట్టెలు కూడా దొరకని పరిస్థితి నెలకొం దన్నారు.   శ్మశాన వాటికల్లో కరోనా మృత దేహాలు  క్యూ కడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలకు భరోసాను కల్పించాల్సింది పోయి  భయాందోళనకు గురిచేయడం సరికాదన్నారు.  ప్రజలు కరోనా వ్యాధితో సతమతమవుతుంటే ఈటల రాజేందర్‌ను భర్తరఫ్‌ చేసి కొత్తనాటకాన్ని తెరమీదకు తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సమావేశంలో  కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్‌, మాజీ ఎంపీటీసీ అహ్మద్‌పాషా, జిల్లా నాయకులు నాగుల విష్ణుప్రసాద్‌, నరేష్‌, కనికరపు రాకేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-11T06:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising