ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హైపవర్‌’ వేతనాల కోసం పోరాటం

ABN, First Publish Date - 2021-08-02T05:56:00+05:30

సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హైపవర్‌ కమిటీ సూచించిన వేతనాలు, ఈఎస్‌ఐ, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు పోరాడుతామని బీఎంఎస్‌ జాతీయ నాయకుడు కొత్తకాపు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కొత్తకాపు లక్ష్మారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీఎంఎస్‌ నాయకుడు కొత్తకాపు లక్ష్మారెడ్డి

గోదావరిఖని, ఆగస్టు 1: సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హైపవర్‌ కమిటీ సూచించిన వేతనాలు, ఈఎస్‌ఐ, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు పోరాడుతామని బీఎంఎస్‌ జాతీయ నాయకుడు కొత్తకాపు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జవహర్‌నగర్‌లోని సరస్వతి శిశుమందిర్‌ ప్రాంగణంలో ఎస్‌సీఎంకేఎస్‌(బీఎంఎస్‌) ఆధ్వర్యంలో జరిగిన కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎంఎస్‌ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు ఏకతాటిపైకి రావాలన్నారు. సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సరైన సంఘం లేకపోవడం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జేబీసీసీఐ వేదికగా బీఎంఎస్‌ హైపవర్‌ వేతనాలపై సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే త్వరలో చెల్లిస్తామని చెప్పి తప్పించుకున్నదన్నారు. ఇతర సంఘాలు కూడా దాట వేసే ఽధోరణి ప్రవరిస్తున్నాయి తప్ప హై పవర్‌ వేతనాలపై శ్రద్ధ పెట్టడం లేదన్నారు. కార్మికుల పక్షాన పోరాడే సంఘం బీఎంఎస్‌ అని, బీఎంఎస్‌ ద్వారా హక్కులు సాధించుకోవచ్చునన్నారు. ఈ సందర్భంగా బీఎంఎస్‌కు అనుబంధంగా సింగరేణిలో కొత్త కాంట్రాక్టు కార్మిక సంఘం ఏర్పాటు చేయాలని తీర్మాణించారు. ఎస్‌సీఎంకేఎస్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు మండ రమాకాంత్‌, పులి రాజిరెడ్డి, మాదవ్‌నాయక్‌, రవీందర్‌రావు, పేరం రమేష్‌, సారంగపాణి, అప్పాసి శ్రీనివాస్‌ కంది శ్రీనివాస్‌, మనోజ్‌కుమార్‌, కందుల నరహరి, వెంకటస్వామి, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-02T05:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising