ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటల రాజేందర్ మోకాలికి ఆపరేషన్

ABN, First Publish Date - 2021-08-02T20:41:23+05:30

మాజీమంత్రి ఈటల రాజేందర్ మోకాలికి వైద్యులు ఆపరేషన్ చేశారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మాజీమంత్రి ఈటల రాజేందర్ మోకాలికి వైద్యులు ఆపరేషన్ చేశారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉంటారు. పది రోజుల తర్వాత వైద్యుల సూచన మేరకు పాదయాత్రపై నిర్ణయం తీసుకోనున్నారు. జులై 19న వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని కమలాపూర్‌ మండలం బత్తినివానిపల్లె నుంచి ప్రజాదీవెన పాదయాత్రను ఈటల ప్రారంభించారు. హుజురాబాద్‌లో నియోజకవర్గంలో 12 రోజులు పాటు పాదయాత్ర సాగింది. అయితే శుక్రవారం వీణవంక మండలంలోని కొండపాక వరకు పాదయాత్రగా వచ్చిన ఆయన మధ్యాహ్న భోజన సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈటల ఆక్సిజన్‌ స్థాయిలు 94-95కు, బీపీ 90/60కి పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. షుగర్‌ లెవల్స్‌ 265కు పెరిగాయని, ఆయన డీహైడ్రేషన్‌కు గురయ్యారని నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకుని పాదయాత్ర ప్రారంభిస్తారని అభిమానులు అనుకున్నారు. ఇంతలోనే ఆయన మోకాలి ఈ రోజు వైద్యులు ఆపరేషన్ చేశారు. 

Updated Date - 2021-08-02T20:41:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising