ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజ చైతన్యంతోనే అవినీతి నిర్మూలన

ABN, First Publish Date - 2021-12-05T06:00:39+05:30

సమాజ చైత న్యంతోనే అవినీతి నిర్మూలన సాధ్యమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. శనివారం సమీకృత రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమా వేశ మందిరంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాల సంద ర్భంగా సిబ్బందితో అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయిం చారు.

ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): సమాజ చైత న్యంతోనే అవినీతి నిర్మూలన సాధ్యమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. శనివారం సమీకృత రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమా వేశ మందిరంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాల సంద ర్భంగా సిబ్బందితో అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబరు 9 వరకు ప్రభుత్వం అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అవినీతి దాని ద్వారా సమాజానికి జరుగుతున్న నష్టం దృష్ట్యా అవినీతిని నిర్మూలించాలనే సంకల్పంతో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి డిసెంబరు 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలని ఐక్యరాజ్య సమితి తీర్మాణించిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అవగాహన కల్పిస్తు న్నట్లు తెలిపారు.  బృహత్తర కార్యక్రమానికి యువత, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు సహకారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో గంగయ్య, వివిధ విభా గాల సూపరింటెండెంట్‌లు రవికాంత్‌, రమేష్‌, రామకృష్ణ, సుజాత, మైనార్టీ సంక్షేమ శాఖ ఓఎస్‌డీ సర్వర్‌మియా తదితరులు పాల్గొన్నారు.

 ఇల్లంతకుంట : అవినీతి నిర్మూలనలో భాగస్వాములు కావాలని ఎంపీడీవో రాజు పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలన వారోత్సవాల సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శనివారం ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.    నీతివంతమైన విధులు నిర్వహించినప్పుడే సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ నర్సింహరెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ సాదిక్‌, ఏపీవో చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.ఎల్లారెడ్డిపేట: అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తహసీల్దార్లు మజీద్‌, తఫజుల్‌హుస్సేన్‌ అన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి తహసీల్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో శనివారం అవినీతి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహించారు.  అనంతరం అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఎంపీడీవో చిరంజీవి, తహసీల్‌ కార్యాలయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కోనరావుపేట: మండల పరిషత్‌ కార్యాలయంలో అవి నీతి నిర్మూలన వారోత్సవాల సందర్భంగా  ఎంపీడీవో రామకృష్ణ, అధికారులు ప్రతిజ్ఞ చేశారు.  అవినీతి  నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  సూచించారు.  

Updated Date - 2021-12-05T06:00:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising