ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య విభాగ ప్రక్షాళనకు కృషి

ABN, First Publish Date - 2021-03-02T05:57:41+05:30

రామగుండం కార్పొరేషన్‌లో పారిశుధ్య విభాగాన్ని ప్రక్షాళన చేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.

స్వీపింగ్‌ యంత్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే చందర్‌ 

- స్వీపింగ్‌ యంత్రం ప్రారంభం

కోల్‌సిటీ, మార్చి 1: రామగుండం కార్పొరేషన్‌లో పారిశుధ్య విభాగాన్ని ప్రక్షాళన చేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. సోమవారం రామగుండం కార్పొరేషన్‌ రూ.60లక్షల వ్యయంతో నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్‌ యంత్రాన్ని మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నగరాన్ని సుందరంగా మార్చాలనేదే తమ లక్ష్యమని తెలంగాణలో పట్టణాల పరిశుభ్రత, పచ్చదనం కోసం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని, రూ.200కోట్లతో రామగుండంలో అభివృద్ధి పనులు చేపడుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, ఏఈ మహేందర్‌, కార్పొరేటర్లు బాల రాజ్‌కుమార్‌, అడ్డాల గట్టయ్య, సాగంటి శంకర్‌, జెడ్‌పీటీసీ ఆముల నారాయణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కిశోర్‌ తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising