ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేరస్థులకు శిక్షపడేలా కృషిచేయాలి

ABN, First Publish Date - 2021-02-28T06:28:16+05:30

నేరస్థులకు శిక్షపడేలా కృషిచేయాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే సూచించారు.

మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎస్పీ రాహుల్‌హెగ్డే

సిరిసిల్ల క్రైం, ఫ్రిబ్రవరి 27: నేరస్థులకు శిక్షపడేలా కృషిచేయాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే సూచించారు. శనివారం పోలీసు జిల్లా కార్యాలయంలో కోర్డు డ్యూటీ ఆఫీసర్లతో ఆయన సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు డ్యూటీ ఆఫీసర్లు బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ప్రతి కేసులోని అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలన్నారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. కోర్టువారికి సమర్పించాల్సిన అన్ని రకాల పత్రాలను సమర్పించి నేరస్థులకు శిక్షపడేలా చేసి బాధితులకు న్యాయం చేకూరేలా చేయాలన్నారు.   కోర్టు సమాచారం ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు తెలియజేయాలన్నారు. కేసు ట్రయల్స్‌ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. కోర్టు విధులలో ప్రతిభ కనపరిచి కేసులలో శిక్షలు పడేలా పనిచేసే సిబ్బందికి ప్రతి నెలా రివార్డులు అందజేస్తామన్నారు.  సమావేశంలో డీసీఆర్‌బీ సీఐ శ్రీలత, సీఐ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T06:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising