ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామగుండం కార్పొరేషన్‌ అభివృద్ధికి కృషి

ABN, First Publish Date - 2021-05-10T05:45:05+05:30

రామగుండం కార్పొరేషన్‌ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, రాష్ట్రంలోనే ఆ దర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు.

సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే చందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

జ్యోతినగర్‌, మే 9 : రామగుండం కార్పొరేషన్‌ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, రాష్ట్రంలోనే ఆ దర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. ఆదివారం కార్పొరేషన్‌ పరిధిలోని 3, 4 డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టణాలలో మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్య తనిస్తున్నదన్నారు. నగరాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు కనీస వసతుల కల్పన, పారిశుద్య పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ ప్రతి ఏటా ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి నెల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నా రని, ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు. సీఎం ప్రత్యేక నిధులతో రామగుండంలో ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీల నిర్మాణంతోపాటు మిషిన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందజేస్తున్నామన్నారు. రామగుండంకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భగీరథకు తాగునీటిని సరఫరా చేస్తున్నామని, దీంతో కార్పొరేషన్‌ ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. భగీరథ ద్వారా డబుల్‌ ఫిల్టర్‌ వాటర్‌ను ప్రజలకు అం దిస్తుంటే ప్రతిపక్ష నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం శోఛనీయమన్నారు. 

రూ 70 లక్షలతో సీసీ రోడ్లు..

3వ డివిజన్‌ పరిధిలోని అన్నపూర్ణకాలనీ, న్యూ పోరట్‌పల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చందర్‌ ఆదివారం శంకుస్థాపన చేశారు. అలాగే 4వ డివిజన్‌ పరిధిలోని అన్నపూర్ణకాలనీలో మిషన్‌ భగీరథ మంచినీటి సరఫరాను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో మేయర్‌ డాక్టర్‌ అనిల్‌ కువూర్‌, డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు, కుమ్మరి శ్రీనివాస్‌, నాయకులు కుమ్మరి శారద, వీరాలాల్‌, ధరణి పోశం, తూం పద్మ, కేవి.చందు, బుర్ర శంకర్‌, భరత్‌గౌడ్‌, అనిల్‌ రావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-10T05:45:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising