ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామగుండంలో భూకంపం కలకలం

ABN, First Publish Date - 2021-10-24T06:22:49+05:30

రామగుండం ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది.

రామగుండం ప్రాంతంలో భూకంపం వచ్చినట్లుగా నిర్ధారించిన ఎన్‌సీఎస్‌ మ్యాప్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మల్కాపూర్‌, మేడిపల్లి శివారుల్లో స్వల్పంగా కంపించిన భూమి

- రిక్టర్‌ స్కేల్‌పై 4.0గా నమోదు - ఆందోళనలో జనం

గోదావరిఖని, అక్టోబర్‌ 23: రామగుండం ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 2గంటల ప్రాం తంలో మల్కాపూర్‌, మేడిపల్లి శివారుల్లో భూస్వల్పంగా కంపించింది. ఈ భూకంపం పై రిక్టర్‌ స్కేల్‌పై 4.0గా నమోదు అయ్యింది. రామగుండం గోదావరిఖని పట్టణ సమీపంలోని మల్కాపూర్‌, మేడిపల్లి గోదావరి నది సమీపంలో వ్యవసాయ భూముల్లో భూమి కంపించింది. దీని ప్రభావం నివాస ప్రాంతాల్లో లేకపోవడంతో ప్రమాదం త ప్పింది. ఓపెన్‌కాస్టులు ఉన్న ఈ ప్రాంతంల మొదటి షిప్టు, రెండవ షిప్టు మార్పు మధ్యా హ్నం 2గంటలకు ప్రతిరోజు ఉంటుంది. ఈ సందర్భంలో ప్రతి మధ్యాహ్నం ఓబీ కోసం, బొగ్గు కోసం భారీ బ్లాస్టింగ్‌లు జరుగుతాయి. ఆ సందర్భంలో కూడా భూమి స్వల్పంగా కంపింది. శనివారం మధ్యహ్నం భూ ప్రకంపనల విషయంలో కూడా ఓపెన్‌కాస్టుల బ్లాస్టింగ్‌లే కారణమని ప్రజలు భావించారు. కానీ మంచిర్యాల జిల్లా సీసీసీ, రామకృష్ణాపూర్‌, పెద్దపల్లి వరకు భూకంప ప్రభావం కనిపించడంతో రామగుండం కార్పొరేషన్‌ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్‌ స్కేల్‌పై 4.0గా నమోదైనా భూకంప ప్రభావం పెద్దగా లేదు. భూకంపశాస్త్ర జాతీయ కేంద్రం ఎన్‌సీఎస్‌ రికార్డు ప్రకారం మధ్యాహ్నం 2.03 నిమిషాలు 30సెకన్లకు భూమి రెండు సెకన్లపాటు కంపించింది. అక్షాంశం 18.46 డిగ్రీలు, రేఖాంశం 79.22డిగ్రీల ప్రాంతంలో 20 కిలోమీటర్ల లోతు నుంచి కేంద్రీకృతమైన భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 4.0గా నమోదు నమోదయ్యింది. ఈ స్వల్ప భూకం పంవల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అసలు భూకంపం వచ్చినట్టు స్థానికులు గుర్తించలేదు. అదే విధంగా శనివారం తెల్లవారుజామున 2.15నిమిషాల15 సెకండ్లకు 10మీటర్ల లోతులో రెండు సెకన్లపాటు భూమి కంపించిందని, రిక్టర్‌స్కేల్‌ పై 4.0గా నమోదయ్యిందని ఎన్‌సీఎస్‌ గుర్తించింది. మొత్తంగా స్వల్ప భూకంపం కా వడంతో రామగుండం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-10-24T06:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising