ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు

ABN, First Publish Date - 2021-10-17T05:05:03+05:30

తెలంగాణ రాష్ట్రంలో ఫార్మ, వైద్య రంగాలు ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నాయని తెలంగాణ ఫార్మసిస్టు జేఏసీ అధ్యక్షుడు మాడెం ప్రభాకర్‌ అన్నారు.

హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న తెలంగాణ ఫార్మసిస్టు జేఏసీ అధ్యక్షుడు మాడెం ప్రభాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ ఫార్మసిస్టు జేఏసీ

హుజూరాబాద్‌ రూరల్‌, అక్టోబరు 16: తెలంగాణ రాష్ట్రంలో ఫార్మ, వైద్య రంగాలు ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నాయని తెలంగాణ ఫార్మసిస్టు జేఏసీ అధ్యక్షుడు మాడెం ప్రభాకర్‌ అన్నారు. శనివారం హుజూరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న జబ్బులకు అనేక రకాల యాంటీబయోటెక్‌ మందులను, టెస్టులను చేసి వందల రూపాయలు అయ్యే వైద్యానికి వేల రూపాయల బిల్లులు వేసి దోచుకుంటున్నాయన్నారు. ప్రైవేట్‌ వ్యాపారస్థుల దందా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుందన్నారు. అర్హత లేని వారు మెడికల్‌ షాపులను నిర్వహించడం, ఆర్‌ఎంపీలు అధిక మోతాదులో మందులు రాయడం, అవగాహన లేకుండా చేస్తున్న ఇట్టీ పరిస్థితులను ప్రభుత్వం గుర్తించి తగిన చర్యలు తీసుకొని ప్రతి గ్రామీణ పీహెచ్‌సీలలో 24గంటల ఫార్మసీ, వైద్య సౌకర్యం అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జనరల్‌ సెక్రటరీ హరికృష్ణ, ఫార్మసిస్టు జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T05:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising