ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవనోపాధిని దెబ్బకొట్టవద్దు

ABN, First Publish Date - 2021-06-18T06:28:24+05:30

ఇరవై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో ప్లాంటేషన్‌ పనులు చేసి దళి తుల జీవనోపాధిని దెబ్బకొట్టవద్దని బీజేపీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు.

దళితులకు మద్దతుగా ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గర్జనపల్లిలో ప్లాంటేషన్‌ పనులను అడ్డుకున్న దళితులు

- మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు

వీర్నపల్లి, జూన్‌ 17: ఇరవై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో ప్లాంటేషన్‌ పనులు చేసి దళి తుల జీవనోపాధిని దెబ్బకొట్టవద్దని బీజేపీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు. మండ లంలోని గర్జనపల్లి గ్రామంలో దళితులు సాగు చేసు కుంటున్న పోడు భూమిలో అటవీ అధికారులు ప్లాం టేషన్‌ పనుల కోసం ఎక్స్‌కవేటర్‌తో గురువారం చదును చేశారు. దీనిని దళితులు అడ్డుకున్నారు. వీరి కి బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సం దర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ గ్రామంలో ని దళితులు తలా 20గుంటల పోడు భూమిని సాగు చేసుకుంటూ 20 ఏళ్లుగా జీవిస్తున్న దళితుల భూమిని లాక్కోవడం ఎంతవరకు సబబన్నారు. గ్రా మంలోని బస్టాండ్‌ ప్రాంతంలో గెస్ట్‌హౌస్‌ కట్టడాన్ని అడ్డుకున్నందుకు దళితుల భూములు లాక్కుంటారా అని ప్రశ్నించారు. ఈ భూమిని కోల్పోతే సుమారు 150 మంది దళితులు రోడ్డున పడతారన్నారు. దళి తులకు న్యాయం జరిగేవరకూ పోరాడతామన్నారు. అనంతరం ఫారెస్టు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే అటవీ అధికారులు చేపట్టిన ప్లాంటేషన్‌ పనులు మానుకోవాలని కోరారు. బీజేపీ మండల అధ్యక్షుడు గునుకుల దేవేందర్‌రెడ్డి, బీజేవై ఎం అధ్యక్షుడు పిట్ల నాగరాజు, ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఎస్టీ మోర్చా జి ల్లా అధ్యక్షుడు భూక్య రమేశ్‌, దిశ కమిటీ సభ్యుడు బట్టు పీర్యా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T06:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising