ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించద్దు

ABN, First Publish Date - 2021-08-01T06:06:24+05:30

గ్రామాల్లోని అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దని అధికారులను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ హెచ్చరించారు.

కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు వినతిపత్రం అందిస్తున్న ప్రజాప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

 కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 

బోయినపల్లి, జూలై 31: గ్రామాల్లోని అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దని అధికారులను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ హెచ్చరించారు. బోయినపల్లి మండలంలోని కొదురుపాక, మాన్వాడ వెంకట్రావుపల్లి గ్రామాలను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అయా గ్రామాల్లోని వైకుంఠధామాలు, కంపోస్ట్‌షెడ్‌లు పరిశీలించారు. వైకుంఠధామాల చుట్టూ తప్పనిసరిగా మొక్కలతో గ్రీన్‌ఫెన్సింగ్‌ చేయించాలని పదే పదే చెబుతున్నా ఎందుకు అలసత్వం వహిస్తున్నారని కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్‌ యార్డు నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. అనంతరం కొదురుపాక గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, కత్తెరపాక ఉమకొండయ్యలు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. కలెక్టర్‌ వెంట డీపీవో రవీందర్‌, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-08-01T06:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising