ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య నిర్వహణ తీరుపై అసంతృప్తి

ABN, First Publish Date - 2021-02-28T06:29:58+05:30

వేములవాడ పట్టణంలో పారిశుధ్య నిర్వహణ తీరు సక్రమంగా లేదంటూ మున్సిపల్‌ పాలకవర్గం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మాట్లాడుతున్న రామతీర్థపు మాధవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వేములవాడ పురపాలక సంఘం సమావేశంలో నిలదీసిన సభ్యులు

వేములవాడ, ఫిబ్రవరి 27:  వేములవాడ పట్టణంలో పారిశుధ్య నిర్వహణ తీరు సక్రమంగా లేదంటూ మున్సిపల్‌ పాలకవర్గం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాశివరాత్రి జాతరకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి అధ్యక్షతన శనివారం పాలకవర్గం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా పలు వురు కౌన్సిలర్లు మాట్లాడుతూ  చెత్త సేకరణ కోసం బండి ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని,  పారిశుధ్య నిర్వహణపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతర సందర్భంగా దేవాలయం నుంచి కేటాయించే నిధులు సరిపోవవడం లేదని, దీనిని దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి కనీసం 50 లక్షల నిధులు మున్సిపల్‌కు కేటాయించాలని కోరారు.  ప్రతీ సమావేశంలో పారిశుధ్య నిర్వహణ లోపాలపై మాట్లాడాల్సి రావడం బాధాకరమని, ఇప్పటికైనా అధికారులు, సిబ్బంది తమ తీరు మార్చుకోవాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, సిబ్బంది  పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T06:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising