ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యుటేషన్‌ సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-01-18T05:22:00+05:30

జిల్లాలోని వివిధ తహసీల్దార్‌ కార్యాలయాలలో పెండింగ్‌లో ఉన్న 329 మ్యుటేషన్‌ సమస్యలు పరిష్కరించాలని మండల అధికారులకు కలెక్టర్‌ రవి ఆదేశాలు జారీ చేశారు.

జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వార అధికారులకు సూచనలు ఇస్తున్న జిల్లా కలెక్టర్‌ రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల (ఆంద్రజ్యోతి), జనవరి 16: జిల్లాలోని వివిధ తహసీల్దార్‌ కార్యాలయాలలో పెండింగ్‌లో ఉన్న 329 మ్యుటేషన్‌ సమస్యలు పరిష్కరించాలని మండల అధికారులకు కలెక్టర్‌ రవి ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ మండలాల తహసీల్దార్‌లతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల వివరాలు తెలుసుకున్నారు. ధరణి పోర్టల్‌లో చేర్చవలసిన రెవెన్యూ అంశాలు, పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు.  ఇప్పటి వరకు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌ వివరాలను వివిధ రికార్డులను సరిచూసుకొని కలెక్టర్‌ కార్యాలయంలో నివేదిక అందజేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో నిషేధిత భూముల వివరాలు, పొరపాటున నిషేదిత భూముల జాబితాలో నమోదైన భూముల వివరాలు పంపాలని ఆదేశించారు. కంపెనీలు సంస్థలు, ఎన్‌ఆర్‌ఐ పెండింగ్‌ కేసుల వివరాలను పంపాలని తహసీల్దార్‌లకు కలెక్టర్‌ ఆదేశాలను జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా,  అవినీతికి పాలుపడినట్లు తన దృష్టకి వచ్చినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా కలెక్టర్‌ రాజేశం పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-18T05:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising