ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ దళితబంధు అందాలి

ABN, First Publish Date - 2021-08-01T05:55:30+05:30

దళిత బంధు పథకం కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ. 10 లక్షల సహాయం అందించాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, జూలై 31 : దళిత బంధు పథకం కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ. 10 లక్షల సహాయం అందించాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాలలోని తన నివాసంలో శనివారం విలేకరుల సమా వేశం నిర్వహించి మాట్లాడారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటిం టికీ మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగనని గత ఎన్నికల్లో చెప్పిన మా దిరిగానే రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సహాయం చేయకుంటే వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఓట్లు అడగనని ప్రతిజ్ఞ  చేయా లని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దళిత బం ధు పథకం మంచి కార్యక్రమమని ఈ పథకం హుజూరాబాద్‌ ఉప ఎన్ని కలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారా..? లేక దళితుల సంక్షేమ కోసం చే స్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పథకం విషయంలో ఓ సారి నియోజకవర్గానికి 100 మందికి, మరోసారి ఏటా 2-3 లక్షల కుటుంబాలకు రూ. 10 లక్షల సహాయం అందిస్తామని చెబుతున్న సీ ఎం ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలుసునన్నారు. రాష్ట్రంలో దళిత జనాభా 16 శాతం ఉందని, అధికార పార్టీకి చెందిన 19 మంది శాసన సభ్యులు ఉంటే మంత్రి వర్గంలో కేవలం ఒక కొప్పుల ఈశ్వర్‌కే మంత్రి పదవి ఇచ్చి దళితుల పట్ల వివక్ష చూపుతున్నారన్నారు. 

మూలుగుతున్న ఎస్సీ డెవలప్‌మెంట్‌ నిధులు

ఏడేళ్ల కాలంలో ఎస్సీ డెవలప్‌మెంట్‌ నిధులు రూ. 35 వేల కోట్లు ఖ ర్చు కాకుండా సీఎం దగ్గరే మూలుగుతున్నాయన్నారు. రానున్న మూడే ళ్లలో బడ్జెట్‌లో దళిత సంక్షేమానికి పెద్దపీట వేసి అత్యధిక నిధులు కే టాయించి ల్యాబ్‌ కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దళి తులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి, మోసం చేయడంతో వా రు రైతుభందు, రైతు బీమాను పొందలేక పోయారని ఇదేనా దళితుల పట్ల చూపిస్తున్న ప్రేమ అని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన దళిత కుటుంబాలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించాలన్నారు. ఈ సమా వేశంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, టీపీ సీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, నాయకులు కల్లెపల్లి దుర్గయ్య, నందయ్య, రాజేందర్‌, గుంటి జగదీశ్వర్‌, రాధకిషన్‌ రావు, చాంద్‌పాష, మధు, జీవన్‌, నేహాల్‌, రియాజ్‌, మహిపాల్‌, రాజేష్‌, గంగాధర్‌, ప్రతాప్‌ ఉన్నారు.


Updated Date - 2021-08-01T05:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising