ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. విరిగిన చెట్లు..

ABN, First Publish Date - 2021-04-23T06:48:36+05:30

మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు దెబ్బతిన్నాయి.

సుల్తానాబాద్‌లో నేలకొరిగిన వరి పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 22: మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు దెబ్బతిన్నాయి. సుల్తానాబాద్‌, సుద్దాల, రేగడిమ ద్దికుంట, అల్లీపూర్‌, గట్టేపల్లి, కదంబాపూర్‌ తదదితర గ్రామాలలో పంటలు దెబ్బతిన్నాయి. మార్కెట్‌ యార్డులో విక్రయం కోసం తెచ్చిన ధాన్యం నిలువలు కూడా వర్షం నీటికి కొట్టుకుపోగా, మరికొన్ని కుప్పలు తడిసిముద్దయ్యా యి. ఎలుగు పోచమల్లుకు చెందిన ఒక ఎకరం వరి పం ట పూర్తిగా పడిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి నీట మునిగిపోగా ధాన్యం గింజలన్నీ నేలరాలిపోయాయి. అల్లీపూర్‌ గ్రామానికి చెందిన ఆవుల శ్రీనివాస్‌ మొక్కజొ న్న పంట పడిపోయింది. వర్షాలకు గాలులకు కంకులతో ఉన్న పంట దెబ్బతింది. సుల్తానాబాద్‌ పట్టణంలోని పలు వార్డులలో చెట్లు విరిగిపోయాయి. పలుచోట్ల రోడ్డపై పడ్డా యి. కరెంట్‌ వైర్లపై కూడా పడిపోవడంతో స్థంబాలు కిం దకు వంగిపోగా, మరికొన్ని చోట్ల విరిగిపోయాయి. గురు వారం ఉదయం మున్సిపాలిటీ వారు పడిపోయిన చెట్ల ను తొలగించారు. విద్యుత్‌ శాఖ వారు కరెంట్‌ స్థంభాల స్థానంలో కొత్తవి అమర్చారు. రాత్రి కొన్ని గంటలు సర ఫరా లేకపోగా గురువారం పూర్తి మరమ్మతులు చేశారు. మండల వ్యాప్తంగా దాదాపు 15 కరెంట్‌ స్థంబాలు విరిగి పోయాయి.

Updated Date - 2021-04-23T06:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising