ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగుపై స్పష్టత ఇవ్వకుంటే క్రాప్‌ హాలిడే ప్రకటిస్తాం

ABN, First Publish Date - 2021-12-06T05:57:37+05:30

పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వకుంటే క్రాప్‌ హాలిడే ప్రకటిస్తామని రైతు ఉద్యమ నేత, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామా రావు హెచ్చరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న రామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతు ఉద్యమ నేత, ఓసీ సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షుడు రామారావు

జగిత్యాల అగ్రికల్చర్‌, డిసెంబరు 5: పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వకుంటే క్రాప్‌ హాలిడే ప్రకటిస్తామని రైతు ఉద్యమ నేత, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామా రావు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌ భవన్‌లో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ వి ద్యుత్‌ సవరణ చట్టం రద్దు, వ్యవసాయ ఉ త్పత్తులకు కనీస మద్దతు ధరల చట్టం కోసం రైతులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప, రైతులకు ఎలాంటి స్పష్టత ఇ వ్వడం లేదన్నారు. రైతుల విషయంలో ఉభయ ప్రభుత్వాలు దోబూ చులా డుతూ, కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి రైతు ల మీద ప్రేమ ఉంటే రైతుల, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తే, రైతు చట్టాల రద్దు తో పాటు మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపజే యాలని, అలాగే విద్యుత్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రామా రావు డిమాండ్‌ చేశారు. ధాన్యాన్ని కొనే భాధ్యత కేంద్రానిది, సేకరించే బాధ్య త రాష్ట్ర ప్రభుత్వానిదని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వాడుకుంటున్నాయని రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ వరిపంట కొనుగో లు చేయని పక్షంలో క్రాప్‌ హాలీడే ప్రకటించి, రైతులకు ప్రతిఫలంగా బతుకు దెరువు నిమిత్తం ఎకరాకు రూ.20 వేలు, వ్యవసాయ కూలీలకు మూడు నెలలకు గాను రూ.40వేలు ఖాతాలో జ మచేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ చట్టం రద్దు, కనీస మద్ద తు ధరల చట్టం కోసం రైతు సంఘాల ఐక్య పోరాటాలను తమ సమాఖ్య ఆ ధ్వర్యంలో పార్టీలకు అతీతంగా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘాల సమాఖ్య నాయకులు మ్యాదరి తిరుపతి రెడ్డి, వెల్దండి గౌతమ్‌ రెడ్డి, కనపర్తి లింగారావు, కెమ్మసారపు సురేష్‌, దేవేంధర్‌ రెడ్డి, వేణు, రాజేంధర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షుడు తాటిపెల్లి రాజన్న, తిరుపతి రావు, కిషన్‌రెడ్డి, రాజు, మల్లేశం, రాజిరెడ్డి తదితరులున్నారు.


Updated Date - 2021-12-06T05:57:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising