ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేషన్‌లో అవినీతిపై విచారణ జరపాలి

ABN, First Publish Date - 2021-06-18T05:25:15+05:30

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ విజిలెన్స్‌ డీజీకి ఫిర్యాదు చేసింది.

విజిలెన్స్‌ ఎస్‌పీకి ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌సిటీ, జూన్‌ 17: రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ విజిలెన్స్‌ డీజీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ముదాం శ్రీనివాస్‌ గురువారం విజిలెన్స్‌ డీజీ కార్యాలయంలో విజిలెన్స్‌ ఎస్‌పీకి ఫిర్యాదు పత్రం అందజేశారు. నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మక్కై కార్పొరేషన్‌ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాజేష్‌ థియేటర్‌ నుంచి కల్లు డిపో వరకు నిర్మిస్తున్న రూ.50లక్షల డివైడర్‌ టెండర్‌ నిబంధనల్లో ఎలక్ర్టికల్‌ క్లాస్‌-1 లైసెన్స్‌ అడిగారని, సదరు కాంట్రాక్టర్‌ మాత్రం ట్రేడ్‌-ఏ ఎలక్ర్టికల్‌ సర్టిఫికెట్‌ పెట్టాడని, కానీ ఇంజనీర్లు టెండర్‌ అగ్రిమెంట్‌ చేశారన్నారు. 90శాతం సివిల్‌, 10శాతం ఎలక్ర్టికల్‌ పని ఉన్నా క్లాస్‌ వన్‌ లైసెన్స్‌ను అడిగారన్నారు. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయించారని, మొక్కలకు నష్టం చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2021-06-18T05:25:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising