ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వందశాతం వ్యాక్సినేషన్‌ చేయాలి

ABN, First Publish Date - 2021-04-11T06:08:07+05:30

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వంద శాతం వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ రవి అన్నారు.

జూమ్‌ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-కలెక్టర్‌ రవి

జగిత్యాల, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వంద శాతం వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ రవి అన్నారు. శనివారం సాయంత్రం ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు ఇతర అధికారులతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై తీసుకోవాల్సిన చర్యలపై జూమ్‌ యాప్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీ క్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో జడ్పీ చైర్‌పర్సన్‌ నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ శాఖలలో పనిచేసే 45 సంవత్సరాలు పైబడి ఉన్న వారికి వ్యాక్సిన్‌ అందించడం జరుగుతుందన్నారు. 45 సంవ త్సరాలకు లోబడి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ఉండి రిజిష్టర్‌ చేసుకోలేని వారికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై జరిమానాలు విధించేలా ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. మాస్కులు ధరించకుండా బయటతిరిగే వారి వద్ద జరిమానాలు వసూలు చేస్తామన్నారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహణ కల్పించాలని సూచించారు. కేసులు అధికంగా వచ్చిన ప్రాంతా లను కంటైన్‌మెంట్‌ జోన్లుగా గుర్తించాలని, సానిటేషన్‌ వర్కర్‌లకు సాధ్య మైనంత ఉదయం వ్యాక్సిన్‌ అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ వద్ద విధులు నిర్వహించే వ్యక్తులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, డ్రైవర్లు, వివిధ విభాగాలలో పనిచేసే వారికికూడా వ్యాక్సిన్‌ అందించాలన్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు ఎంత మంది వచ్చినా అవసరమైన వ్యాక్సిన్‌, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. సెలవు రోజుల్లో కూడా అధికారులు బాగా పనిచేస్తున్నారన్నారు. రాబోయే మూడు రోజుల్లో 45 సంవత్సరాలు నిండిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, సిబ్బంది, ప్రజాప్రతినిధులకు వ్యాక్సిన్‌ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అవసరం మేరకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుశ్రీ, జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌, పలువురు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి కార్యక్రమం రద్ధు

 కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ శనివారం తెలిపారు. ఈ నెల11వ తేదీన నిర్వహించాల్సిన ప్రజావాణిని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరించా లన్నారు. ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. అధికంగా సంచారం లేకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. అధికా రుల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలన్నారు. వ్యక్తిగత శుభ్ర తకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పడు చేతులు శుభ్రం చేసు కోవాలని తెలిపారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని, శానిటైజర్‌ విని యోగించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.  

Updated Date - 2021-04-11T06:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising