ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్యనే పోటీ

ABN, First Publish Date - 2021-10-15T06:41:26+05:30

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్యనే పోటీ ఉంటుందని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు.

హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న ఇనుగాల పెద్దిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసహానంతో మాట్లాడుతున్న ఈటల

 మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి

హుజూరాబాద్‌, అక్టోబరు 14: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్యనే పోటీ ఉంటుందని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. గురువారం హుజూరాబాద్‌ పట్టణంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ మాట్లాడిన మాటలను చూసి మతి తప్పి మాట్లాడుతున్నాడని ప్రజలు అనుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ వాళ్లు ఓటుకు డబ్బులు ఇస్తున్నారని, ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈటలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. హుజూరాబాద్‌లో 4వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు సీఎం కేసీఆర్‌ మంజూరు చేస్తే ఈటల ఏ ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదన్నారు. ఆరుసార్లు కేసీఆర్‌ బొమ్మతోనే ఈటల ఎమ్మెల్యేగా గెలిచాడన్నారు. ఓటమి భయంతో ఈటల రాజేందర్‌ అసహానంతో మాట్లాడుతున్నారన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఈటల రాజేందర్‌ చేయలేని అభివృద్ధిని ఇన్‌చార్జీగా వచ్చి కేవలం రెండు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి హరీష్‌రావు చేశారన్నారు. కార్యక్రమంలో బండ శ్రీనివాస్‌, వడ్లూరి విజయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక-శ్రీనివాస్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల-శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-15T06:41:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising