ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూటీ డిక్కీలో నాగుపాము

ABN, First Publish Date - 2021-08-25T06:30:08+05:30

వర్షాకాలంలో గ్రామాల్లో పాముల భయం వెంటాడుతుంది. చెట్లపొదలు, పుట్టల్లోకి నీరు చేరడంతో ఇళ్లలోకి చేరి భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఇంటి ఆవరణలోని కార్లు, బైకు ల్లోకి దూరుతాయి. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్కూటీడిక్కీలో నాగుపాము హడలెత్తించింది.

పామును పడుతున్న ఫ్రెండ్స్‌ ఫర్‌ స్నేక్‌ సొసైటీ సభ్యుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తంగళ్లపల్లి, ఆగస్టు 24:  వర్షాకాలంలో గ్రామాల్లో పాముల భయం వెంటాడుతుంది. చెట్లపొదలు, పుట్టల్లోకి నీరు చేరడంతో ఇళ్లలోకి చేరి భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఇంటి ఆవరణలోని కార్లు, బైకు ల్లోకి దూరుతాయి. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్కూటీడిక్కీలో నాగుపాము హడలెత్తించింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె గ్రామానికి చెందిన సిలివేరి పోచయ్య అనే రైతు ఇంటి ఎదుట పార్క్‌ చేసిన స్కూటీ డిక్కీలో నుంచి పాము బుసకొట్టే శబ్ధం వినిపించింది. అనుమానం వచ్చిన పోచయ్య మెల్లగా డిక్కీ తెరిచాడు. అందులో నాగుపాము కనిపించడంతో హడలెత్తిపోయాడు. వెంటనే స్కూటీ సీటును క్లోజ్‌ చేశాడు. ఫ్రెండ్స్‌ ఫర్‌ స్నేక్‌ సొసైటీ సభ్యులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న సభ్యులు డిక్కీలోని పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. 

Updated Date - 2021-08-25T06:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising