ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంట్‌ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలి

ABN, First Publish Date - 2021-12-02T06:19:28+05:30

ప్రస్తుత పార్లమెంట్‌ సమా వేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి, బిల్లు చట్టబద్దత కల్పించాలని ఎంఆర్‌పీఎస్‌ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గంగాథర నరేష్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కరపత్రం ఆవిష్కరిస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గంగాధర నరేష్‌ 

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 1: ప్రస్తుత పార్లమెంట్‌ సమా వేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి, బిల్లు చట్టబద్దత కల్పించాలని ఎంఆర్‌పీఎస్‌ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గంగాథర నరేష్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రం లోని స్థానిక తహసీల్‌ చౌరస్తా వద్ద ఛలో ఢిల్లీ కార్యక్రమ కర పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్‌ కో సం 27 ఏళ్లుగా పోరాటం చేస్తున్న, ప్రాణ త్యాగాలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లు నెరవేర్చలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకోవడానికి మాదిగ, మాదిగ ఉపకులాలు సిద్ధం కావాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో లింగంపెల్లి లక్ష్మణ్‌, దుబ్బ శ్రీనివాస్‌, మెడపట్ల చంద్రయ్య, వంశీ, నక్క రమణ తదితరులున్నారు.

చలో ఢిల్లీ విజయవంతం చేయండి- గాజుల నాగరాజు 

 ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగే ధర్నా కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో బీసీ కులబాంధవులు తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల నాగరాజు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలో చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  ప్రధాని మోదీ బీసీ అయి ఉండి కూడా బీసీ గణన చేపట్టకపో వడం దురదృష్టకరం అన్నారు. బీసీల సంక్షేమానికి ఉభయ ప్ర భుత్వాలు చొరవ చూపి తమ చిత్తశుద్ధిని కాపాడుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు భార్గవ్‌, ఆకుల నాగరాజు, తోపారపు శ్రీహరి, నరేష్‌, సత్యం, శ్రీనివాస్‌, నర్స య్య, లక్ష్మీనారాయణ, తిరుపతి, గంగారాం తదితరులున్నారు.


Updated Date - 2021-12-02T06:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising